అమరావతికి నిధుల వరద విజయవాడ, జూలై 25 (న్యూస్ పల్స్) A flood of funds for Amaravati సరిగ్గా ఐదేళ్ల క్రితం 2019 జూలై నెలలో ప్రపంచ స్థాయి ఆర్థిక సంస్థలు ఆంధ్రప్రదేశ్ నుంచి పెట్టుబడుల్ని ఉపసంహరించు కున్నాయి. 2019లో ఏపీ అధికారంలోకి వచ్చిన వైఎస్సాఆర్సీపీ ప్రభుత్వ ప్రాధాన్యతలు, కేంద్రం ఆలోచనలు నేపథ్యంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. 2014-18 మధ్య ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామిగా ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా అమరావతి నిర్మాణానికి శంకు స్థాపన చేశారు. 2018లో జరిగిన నాటకీయ పరిణామలు, ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ నేపథ్యంలో ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చేసింది. 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించడంతో ఏపీ ప్రభుత్వ ప్రాధాన్యతలు కూడా మారిపోయాయి.…
Read More