విజయవాడ, జూన్ 14, (న్యూస్ పల్స్) ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై తెలుగుదేశం పార్టీ చాలా కాలంగా ఆరోపణలు చేస్తోంది. వైసీపీ హయాంలో లక్షల కోట్ల అప్పులు చేశారని అనేక సార్లు ఆరోపించారు. అసలైన వివరాలు బయట పెట్టడం లేదని గవర్నర్‌కు అనేక సార్లు ఫిర్యాదులు కూడా చేశారు. పదమూడు లక్షల కోట్ల అప్పులు చేశారని తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. అయితే ఇంత వరకూ పూర్తి వివరాలు మాత్రం వెల్లడి కాలేదు. ఇప్పుడు ప్రభుత్వం మారింది. పూర్తి స్థాయి లెక్కలను బయట పెట్టేందుకు సిద్దమయింది. ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రాన్ని అసెంబ్లీలో ప్రకటించే అవకాశం ఉంది. కొత్త ఆర్థిక సంవత్సరంలో ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ ఏపీ ప్రభుత్వం ప్రతీ వారం రెండు నుంచి నాలుగువేల కోట్ల వరకూ అప్పు తీసుకు వస్తోంది. యభై రోజుల్లోనే పాతిక వేల కోట్ల వరకూ…
Read More