అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తాం సిఎం రేవంత్ హామి హైదరాబాద్ Agrigold అగ్రిగోల్డ్ అంశంపై సమగ్ర విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ హామి ఇవ్వడం పట్ల తెలంగాణ అగ్రిగోల్డ్ బాధితుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు, సిపిఐ సహాయ కార్యదర్శి ఎన్.బాలమల్లేష్ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు ఎన్.సునీత హర్షం వ్యక్తం చేశారు. అగ్రిగోల్డ్ సంస్థ ఎక్కువ లాభాలు ఇస్తామని నమ్మించి ప్రజల నుంచి డిపాజిట్లను సేకరించి మోసం చేసిందని, వారికి న్యాయం చేయాలని కోరుతూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్ కూనంనేని సాంబశివరావు నేతృత్వంలో తెలంగాణ అగ్రిగోల్డ్ బాధితుల సంఘం ప్రతినిధుల బృందం సిఎం రేవంత్ కలిసి వినతి పత్రం సమర్పించింది. రాష్ట్రంలో అగ్రిగోల్డ్ బాధితులు 5 లక్షలమంది ఉన్నారని, వీరి నుంచి ఆ సంస్థ రూ.500 కోట్లను సేకరించిందని తిరిగి చెల్లించే…
Read More