Sweden is becoming an Islamic country | ఇస్లామిక్‌ దేశంగా మారుతున్న స్వీడన్‌ | Eeroju news

Sweden is becoming an Islamic country

ఇస్లామిక్‌ దేశంగా మారుతున్న స్వీడన్‌

న్యూఢిల్లీ ఆగస్టు 21, (న్యూస్ పల్స్)

Sweden is becoming an Islamic country

తమ దేశంలో ఉపాధి లేనప్పుడు… ఆర్థిక సమస్యలు ఎదురవుతున్నప్పుడు, యుద్ధాలు జరుగుతున్నప్పుడు పొరుగు దేశాలకు వలసలు వెళ్లడం ప్రపంచంలో సర్వ సాధారణంగా మారింది. ఎక్కువ మంది విద్య, ఉద్యోగాల కోసం వలస వెళుతన్న దేశం అమెరికా. అగ్రరాజ్యానికి పొరుగు దేశాల నుంచే కాకుండా వివిధ దేశాల నుంచి ఏటా లక్షల మంది వలస వస్తుంటారు. వలసల నియంత్రణకు అమెరికా కూడా చర్యలు చేపడుతోంది. ఈ మేరకు హెచ్‌1బీ వీసా ఉన్నవారినే అనుమతిస్తోంది. అయితే పొరుగున్న ఉన్న బ్రెజిల్, స్వీడన్‌ నుంచి ఎక్కువ మంది అక్రమంగా దేశంలోకి వలస వస్తున్నారు. వలసల సమస్య కూడా ఆ దేశ ఎన్నికల్లో ప్రభావం చూపుతుంది.

ఇదిలా ఉంటే.. స్వీడన్‌ వాసులు ఎక్కువగా అమెరికా వంటి దేశాలకు వలస వెళుతుండగా.. శరణార్థులు మాత్రం స్వీడన్‌ను తమకు ఇష్టమైన గమ్యస్థానంగా మార్చుకున్నారు. దీంతో శరణార్థుల సంఖ్య ఏటేటా స్వీడర్‌లో భారీగా పెరుఉతోంది. స్వీడన్‌లో శరణార్థులు 20 లక్షలకుపైనే ఉంది. ఇది స్వీడన్‌ మొత్తం జనాభాలో ఐదో వంతు. అంటే 20% మరోవైపు తమ దేశం విడిచి వెళ్లేందుకు స్వీడిష్‌ ప్రభుత్వం డబ్బు చెల్లిస్తోంది. దీంతో స్వీడన్‌లోని స్థానిక పౌరులు అమెరికా వంటి దేశాలకు వలస వెళ్తున్నారు. అయితే, స్వీడన్‌ జనాభా మాత్రం పెరుగుతోంది. దీనికి ప్రధాన కారణం ముస్లిం శరణార్థులు. ఏటా ముస్లిం శరణార్థులు వేల మంది స్వీడన్‌కు వస్తున్నారు. దీంతో త్వరలోనే స్వీడన్‌ జనాభాను ముస్లిం శరణార్థులు మించిపోయినా ఆశ్చర్యం లేదు.

స్వీడన్‌లో పెరుగుతున్న శరణార్థుల జనాభాను నియంత్రించేందుకు అక్కడి ప్రభుత్వం అనేక ఆంక్షలు విధించింది. సిరియా, సోమాలియా, ఇరాన్‌ మరియు ఇరాక్‌ వంటి ఇస్లామిక్‌ దేశాల నుంచి పెద్ద సంఖ్యలో ముస్లింలు ఇక్కడ నివసిస్తున్నారు. ఇటీవలి సంవత్సరాలలో స్వీడన్‌లో అనేక హింసాత్మక సంఘటనలు జరిగాయి. గతేడాది 348 కాల్పుల ఘటనలు జరిగాయి. ఈ దాడిలో 52 మంది చనిపోయారు. ఇందుకు శరణార్థులే కారణమని చెబుతున్నారు. ఈ దేశానికి 1990 నుంచి శరణార్థుల రాక మొదలైంది. మొదట్లో పెద్దగా పట్టించుకోలేదు. కానీ, ఇప్పుడు శరణార్థులే అసలు జనాభాగా మారిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీంతో వారిని నియంత్రించేందుకు 2022 అక్టోబర్‌లో ఏర్పడిన ఉల్ఫ్‌ క్రిస్టర్స్‌న్‌ ప్రభుత్వం శరణార్థుల నియంత్రణ చర్యలు చేపట్టింది.

నేషనలిస్ట్‌ స్వీదన డెమొక్రాట్స్‌ పార్టీ కూడా ఆయనకు మద్దతు ఇస్తుంది. ఈ పార్టీ శరణార్థులకు వ్యతిరేకం, శరణార్థులు దేశ సంస్కృతిక కాకుండా ఆర్థిక వ్యవస్థకు కూడా హాని కలిగిస్తారని ఆయన అభిప్రాయపడ్డారు..ఇదిలా ఉంటే.. శరణార్థుల భారం తగ్గించుకునేందుకు స్వీడన్‌ ప్రభుత్వం ఆ దేశం విడిచి వెళ్లే వారికి రూ.80 వేలు ఇస్తుంది. స్వీడన్‌ మంత్రి మరియా స్క్రీన్గార్డ్‌ చేసిన కొత్త ప్రతిపాదన ప్రకారం, స్వీడన్‌ సంస్కృతిని ఇష్టపడని లేదా అంగీకరించని వాడు స్వీడిష్‌ను విడిచి పెట్టవచ్చు. స్వీడన్‌ పౌరులు, దేశం విడిచి వెళితే, ప్రభుత్వం వారికి 80 వేలు మరియు అద్దె ఇస్తుంది. ఈ డబ్బు దేశం విడిచి వెళ్లే ముందు ఒక్కసారి మాత్రమే ఇవ్వబడుతుంది. దేశం విడిచి వెళ్లే వారికి ఇచ్చే డబ్బును రూ.12 లక్షలకు పెంచాలనే ఆలోచన ఉంది. అయితే దీనిపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. దేశం విడిచి వెళ్లి వారికి ఎక్కువ జీతం ఇస్తే స్వీడిష్‌ ప్రజలు ఇష్టపడరు’ అనే సందేశం పంపుతుందని ప్రభుత్వం పేర్కొంది.

Sweden is becoming an Islamic country

 

Bharti as party mouthpiece…? | పార్టీ మౌత్ పీస్ గా భారతి…? | Eeroju news

Related posts

Leave a Comment