Suryapet:సూర్యాపేటలో పంటలు ఎండిపోతున్నాయి.. మంత్రి ఉత్తమ్ కు ఉసురు తగులుతుంది:సూర్యాపేట జిల్లా పర్యటనలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేసారు. సాగుకు నీళ్లివ్వక రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి రైతుల ఉసురు తగులుతుంది. తక్షణమే మేడిగడ్డ ప్రాజెక్టును వినియోగంలో తేవాలి . ప్రభుత్వానికి జల విధానం లేదా ? తెలంగాణ నీళ్లు మలపాలన్న సోయి లేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
సూర్యాపేటలో పంటలు ఎండిపోతున్నాయి
మంత్రి ఉత్తమ్ కు ఉసురు తగులుతుంది
సూర్యాపేట
సూర్యాపేట జిల్లా పర్యటనలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేసారు. సాగుకు నీళ్లివ్వక రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి రైతుల ఉసురు తగులుతుంది. తక్షణమే మేడిగడ్డ ప్రాజెక్టును వినియోగంలో తేవాలి . ప్రభుత్వానికి జల విధానం లేదా ? తెలంగాణ నీళ్లు మలపాలన్న సోయి లేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మేడిగడ్డను వాడుకోక తెలంగాణను ఎండబెడుతున్నారు. మరోపక్క ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 199 టీఎంసీలతో బనకచర్లలో ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. కానీ మన ముఖ్యమంత్రి మాత్రం నాగార్జున సాగర్ ను కూడా మన ఆధీనంలోకి తీసుకురాలేకపోయారు. కాళేశ్వరం ద్వారా సూర్యాపేట జిల్లాలో గోదావరి జలాలను పారించిన కేసీఆర్. కృష్ణా పరివాహక ప్రాంతంలోనూ గోదావరి నుంచి నీళ్లు ఇచ్చిన ఘనత కేసీఆర్ ది . కేసీఆర్ హయాంలో కోదాడ నియోజకవర్గానికి కాళేశ్వరం ద్వారా లక్షా 22 వేల ఎకరాలకు నీళ్లు అందించారని అన్నారు. ఇప్పుడు నీళ్లు ఎందుకు తేవడం లేదని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని సవాలు చేస్తున్నాను. ఇప్పుడు నీళ్లు ఎందుకు తేవడం లేదు..? మేడిగడ్డ పాడయిందా ? రాజకీయ కక్షతోనే మేడిగడ్డ ప్రాజెక్టును వినియోగించడం లేదని ఇంజనీర్లు చెబుతున్నారు. మరో 40 రోజుల పాటు నీళ్లు ఇస్తేనే పంటలు చేతికొచ్చే అవకాశం ఉంటుంది. పోయిన ఏడు నీళ్లు ఇవ్వక సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో 4 లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయింది. ఈ మొత్తం వ్యవహారానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బాధ్యత వహించాలని అన్నారు. సూర్యాపేట జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయంటే ఆ పాపం, ఉసురు మంత్రి ఉత్తమ్ కు తగులుతుంది. జిల్లా మంత్రియే కాకుండా సాగునీటి శాఖ మంత్రిగా ఉండి ఈ ప్రాంతానికి నీళ్లు ఇవ్వని మంత్రి ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే . రోజంతా కేసీఆర్ ను తిట్టుకుంటూ తిరిగితే కాంగ్రెస్ నాయకులకు ఒరిగేదేమీ లేదు. కేసీఆర్ ప్రజల పట్ల, రాష్ట్రం పట్ల ప్రేమతో పరిపాలించారు. 14 నెలల్లో 30 సార్లు ఢిల్లీ వెళ్ళిన సీఎం రేవంత్ రెడ్డి. ఎవరు ఏమనుకున్నా ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పెద్దల కాళ్లు పట్టుకుంటా అన్నట్లుగా సీఎం వ్యవహరిస్తున్నారు. ఏ ఒక్క అంశంపై ముఖ్యమంత్రి ఆలోచన చేయకుండా పాలిస్తున్నారు. మహిళలకు ఒక్క కార్యక్రమాన్ని కూడా చేయని కాంగ్రెస్ ప్రభుత్వం. మహిళల అంశాలపై ముఖ్యమంత్రి కనీసం ఒక సమీక్ష చేయలేదు. మహిళలకు ప్రభుత్వం ఏమి చేయలేదు. చర్చలు రావాలని ప్రభుత్వ పెద్దలకు సవాలు చేస్తున్నానని అన్నారు. కేసీఆర్ హయాంలో మహిళలకు పెద్దపీట వేశాం. మహిళా అభివృద్ధి, సంక్షేమం కోసం కేసీఆర్ ఎంతో కృషి చేశారు. కేసీఆర్ హయాంలో మహిళలపై నేరాలు చేయాలంటే వెన్నులో వణుకుపుట్టేది . కానీ ఇప్పుడు రాష్ట్రంలో మహిళలకు భద్రత లేని పరిస్థితి వుంది. మతకల్లోలం లేని ప్రాంతం లేదు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలనలో శాంతి భద్రతల సన్నగిల్లాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటు ఏ వర్గానికి కాంగ్రెస్ చేసిందేమీ లేదు. ఎస్సీ వర్గీకరణ కోసం కేసీఆర్ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఎస్సీ, బీసీల జనాభాను తక్కువ చేసి చూపిస్తున్నది. గందరగోళం.. కాకిలెక్కలతో కాలం వెల్లదీస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీ గల్లా పట్టుకొని అడిగితే రైతు రుణమాఫీని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఎవరికీ సంపూర్ణంగా రుణ మాఫీ కాలేదని అన్నారు. రైతుభరోసా ఒక్కో గ్రామంలో సగం మంది రైతులకు కూడా రాలేదన్నారు.
Read more:Tirupati:కేంద్ర ప్రభుత్వం ద్వారా నక్ష (NAKSHA) కార్యక్రమం కింద తిరుపతి పట్టణం ఎంపిక