Supreme serious about Mamata Sarkar | మమతా సర్కార్ పై సుప్రీం సీరియస్ | Eeroju news

Supreme serious about Mamata Sarkar

మమతా సర్కార్ పై సుప్రీం సీరియస్

న్యూఢిల్లీ, ఆగస్టు 20

Supreme serious about Mamata Sarkar

కోల్‌కతాలోని ప్రభుత్వ ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో మహిళా వైద్యురాలిపై అత్యాచారం మరియు హత్య కేసుపై సుప్రీం కోర్టు విచారణ ప్రారంభించింది. సూమోటోగా తీసుకున్న కేసును విచారించిన సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళలు పని ప్రదేశాల్లోనే భద్రత లేకపోయే వారికి సమానత్వం ఎక్కడ వస్తుందని ప్రశ్నించారు. విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ మాట్లాడుతూ.. కోల్‌కతా అత్యాచారం కేసును హైకోర్టు విచారిస్తోందని తెలుసు కానీ ఈ దుర్ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఓ వైద్యుల భద్రతకు సంబంధించిన అంశం కావడంతో సూమోటోగా తీసుకొని విచారిస్తున్నాం అని అన్నారు.

ఈ కేసులో ఎఫ్‌ఐఆర్ కూడా ఆలస్యంగా దాఖలయ్యింది. ఆ ఎఫ్‌ఐఆర్‌లో హత్య ప్రస్తావన ఉందా?. కేసును ఆత్మహత్యగా చెబుతున్నప్పుడు ప్రిన్సిపాల్ ఏమి చేస్తున్నారనేది అతిపెద్ద ప్రశ్న” అని చీఫ్ జస్టిస్ అడిగారు. దీనిపై విచారణ చేస్తున్న కేంద్ర దర్యాప్తు సంస్థ తన విచారణకు సంబంధించిన స్టేటస్ రిపోర్టును కోర్టు ముందు ఉంచాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దర్యాప్తు స్థితిని కూడా తెలియజేయాలని సూచించింది. అనంతరం కేసు విచారణను గురువారానికి వాయిదా వేశారు. దేశవ్యాప్తంగా ఆసుపత్రుల్లో, ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రులలో యువ వైద్యుల దుస్థితి గురించి మాట్లాడారు. వాళ్ల పరిస్థితి ఏం బాగాలేదని అన్నారు. వారంతా ఇంటర్న్‌లు, రెసిడెంట్ డాక్టర్లు అన్నింటికంటే ముఖ్యంగా మహిళా డాక్టర్లు అని తెలుసున్నారు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్.

యువ వైద్యుల్లో చాలా మంది 36 గంటల పాటు పని చేస్తున్నారని తెలుస్తోంది. అక్కడ కూడా సరైన వసతులు భద్రత లేదనేది సమాచారం. సురక్షితమైన పని పరిస్థితులు కల్పించేందుకు చేపట్టాల్సిన చర్యల కోసం జాతీయ ప్రోటోకాల్‌ డెవలప్‌ చేయాల్సి ఉంది. పని ప్రదేశాల్లో మహిళలకు రక్షణ లేకుండా వారు ఉద్యోగాలకు వెళ్లలేని దుస్థితి ఉదంటే మనం వారి  సమానత్వాన్ని నిరాకరిస్తున్నామని అన్నారు. ఇది చాలా తీవ్రమైన విషయమన్నారు చీఫ్ జస్టిస్. వీటన్నింటిపై నేషనల్‌ టాస్క్‌ ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలి చూస్తున్నాం. సీనియర్ మరియు జూనియర్ వైద్యుల భద్రత కోసం దేశవ్యాప్తంగా అనుసరించాల్సిన విధివిధానాలను ఈ టాస్క్‌ఫోర్స్ సూచిస్తుంది. అన్నారు.

ప్రిన్సిపల్ ప్రవర్తనపై అనుమాలు ఉన్నా.. అతడిని వెంటనే మరో కాలేజీకి ఎలా నియమించారని సీజేఐ జస్టిస్ డి.వై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రశ్నించింది. ఇక ఎఫ్‌ఐఆర్‌ నమోదు కూడా ఆలస్యమైంది. మృతదేహాన్ని అంత్యక్రియలకు అప్పగించిన మూడు గంటల తర్వాత రాత్రి 11.45 గంటలకు ఎందుకు నమోదు చేయాల్సి వచ్చింది? ఆసుపత్రి అధికారులు, కోల్‌కతా పోలీసులు అప్పటిదాకా ఏం చేస్తున్నారు అంటూ ధర్మాసనం ప్రశ్నల వర్షం కురిపించింది.
ఇక పలు మీడియా సంస్థల తీరుపై కూడా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధితురాలి ఫొటో, పేరును ఎలా ప్రచురిస్తారంటూ ప్రశ్నించింది. అలాగే వ్యవస్థలో ఉన్న కొన్ని లోపలపై కూడా ధర్మాసం పలు కీలక ప్రశ్నలను సంధించింది. మహిళలు ఉద్యోగాలకు వెళ్లే పరిస్థితి లేకపోతే.. పనిచేసే ప్రదేశంలో భద్రత లేకపోతే వారికి మనం సమానత్వాన్ని నిరాకరిస్తున్నట్లేనని కోర్టు అభిప్రాయపడింది.

ప్రస్తుత రోజుల్లో చాలా మంది యంగ్‌ డాక్టర్లు 36 గంటలు ఏకధాటిగా పనిచేస్తున్నారు. వారికి పని ప్రదేశంలో భద్రత కల్పించడం కోసం ఓ జాతీయ ప్రొటోకాల్‌ను రూపొందించడం అత్యవసరమని కోర్టు వెల్లడించింది. ఇందుకోసం వెంటే ఓ జాతీయ టాస్క్‌ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో హైదరాబాద్‌కు చెందిన ఏషియన్‌ ఇనిస్టిట్యూట్ ఆఫ్‌ నేషనల్‌ గ్యాస్ట్రాలజీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ నాగేశ్వర్‌ రెడ్డి, సర్జన్‌ వైస్‌ అడ్మిరల్‌ ఆరే సరిన్‌ తదితరులు సభ్యులుగా ఉంటారని ధర్మాసనం తెలిపింది. రెండు వారాల్లోపు మధ్యంతర నివేదిక సమర్పించాలని నేషనల్‌ టాస్క్‌ఫోర్స్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. మరోవైపు డాక్టర్ల విధుల బహిష్కరణతో చాలా మంది రోగులు ఇబ్బందిపడుతున్నారని, తక్షణమే తమ నిరసనలు విరమించాలని డాక్టర్లకు సుప్రీంకోర్టు విజ్ఞప్తి చేసింది.  అనంతరం ఈ విచారణను సుప్రీంకోర్టు గురువారానికి వాయిదా వేసింది.

విధుల్లో చేరాలని వైద్యులకు సుప్రీంకోర్టు రిక్వస్ట్
దయచేసి విధులకు రండి… దేశ ప్రజల తరఫున వైద్యులను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి విజ్ఞప్తి చేశారు. “మీ భద్రతపై దేశం మొత్తం ఆందోళన చెందుతోంది. దేశవ్యాప్తంగా ఉన్న వైద్యులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మమ్మల్ని నమ్మండి. రోగులు నష్టపోతున్నారు. కచ్చితంగా మీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. సేవలు రద్దు చేయడం సరికాదు. మీరు విధుల్లోకి రండి” అని సీజేఐ విజ్ఞప్తి చేస్తున్నారు.

Supreme serious about Mamata Sarkar

 

Investors beer alert on Hindenburg report | హిండెన్ బర్గ్ రిపోర్టుపై ఇన్వెస్టర్లు బీ అలర్ట్ | Eeroju news

Related posts

Leave a Comment