Supreme Court | మదర్సాల విషయంలో సుప్రీంకోర్టు స్టే | Eeroju news

మదర్సాల విషయంలో సుప్రీంకోర్టు స్టే

మదర్సాల విషయంలో సుప్రీంకోర్టు స్టే

న్యూఢిల్లీ అక్టోబర్ 21

Supreme Court

మదర్సాల విషయంలో బాలల హక్కుల పరిరక్షణ కమిషన్(NCPCR) సిఫార్సులపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. విద్యాహక్కు చట్టాన్ని పాటించడం లేదని ఆరోపిస్తూ ప్రభుత్వ నిధులతో నడిచే మదర్సాలను మూసేయాలని కేంద్రం, రాష్ట్రాలు తీసుకున్న తదుపరి చర్యలపైన సుప్రీంకోర్టు స్టే విధించింది. యూపి, త్రిపుర ప్రభుత్వాలు ఇటీవల జారీ చేసిన ఉత్తర్వులను కూడా సుప్రీంకోర్టు నిలిపివేసింది.

యూపి ప్రభుత్వ ఉత్తర్వులను సవాలు చేస్తూ జామియత్ ఉలమా-ఇ-హింద్ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ప్రధాన న్యాయమూర్తి డివై. చంద్రచూడ్, న్యాయమూర్తులు జెబి. పార్థివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ ను పరిగణనలోకి తీసుకుంది. నాలుగు వారాల్లో సమాధానం ఇవ్వాలని కోరుతూ కేంద్రం, అన్ని రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది.

తదుపరి నోటీసు వచ్చే వరకు రాష్ట్రాలు జారీ చేసే ఉత్తర్వులు నిలిపివేయాలని కోర్టు ఆదేశించింది. యూపి , త్రిపుర సహా ఇతర రాష్ట్రాలను పిటిషన్ లో ప్రతివాదులుగా చేర్చడానికి జామియత్ ఉలమా-ఇ-హింద్ కు కోర్టు అనుమతిని ఇచ్చింది.

మదర్సాల విషయంలో సుప్రీంకోర్టు స్టే

Supreme Court | సుప్రీం కోర్టు తీర్పుతో… వైసీపీలో మోదం | Eeroju news

Related posts

Leave a Comment