Submerged flooded villages in AP | కుదుట పడుతున్న ముంపు గ్రామాలు

Vijayawada floods

కుదుట పడుతున్న ముంపు గ్రామాలు

Vijayawada floods

విజయవాడ
గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలు దెబ్బకు అతలాకుతలమైన తెలుగు రాష్ట్రాలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయి. వర్ష బీభత్సానికి,  రాష్ట్రంలో పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. ముంపు ప్రాంతాలలో వారం రోజులుగా కరెంటు సౌకర్యం కూడా లేక తీవ్ర ఇబ్బందులు పడ్డామని బాధితులు చెబుతున్నారు. గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది దీంతో రెండు రోజుల క్రితం వరద తగ్గినప్పటికీ వర్ధధాటికి విద్యుత్ స్తంభాలు, రోడ్లు కొట్టుకుపోవడం తో గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేయటంతో ప్రజలు కొంచెం ఇబ్బందులు తీరుతాయి అనుకుంటున్నారు కానీ పెనుగంచిప్రోలు మండలం ముచ్చింతల గ్రామానికి నేటికీ వారం రోజులు గడుస్తున్నప్పటికీ గ్రామంలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో గ్రామ ప్రజలకు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. గురువారం రాత్రి 11 గంటల అయినప్పటికీ విద్యుత్ సరఫరా లేకపోవడంతో విషయాన్ని ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్యా) దృష్టికి పెనుగంచిప్రోలు మండల అధ్యక్షులు చింతల సీతారామయ్య తీసుకువెళ్ళడంతో హటాహుటిన విద్యుత్ అధికారులు వెంటపెట్టుకొని గ్రామానికి వెళ్లేందుకు మార్గం లేకపోవడంతో సుమారు 40 కిలోమీటర్ల చుట్టూ తిరిగి ముచ్చింతాల గ్రామం చేరుకొని సుమారు మూడు గంటలు గ్రామంలోని విద్యుత్ అధికారులతో దగ్గర ఉండి మరమ్మతులు చేపించి గ్రామంలో విద్యుత్ సరఫరా చేయించి గ్రామం నుంచి ఇంటికి తిరిగి వెళ్లారు దీంతో గ్రామ ప్రజలు ఎమ్మెల్యేకి ధన్యవాదాలు తెలిపారు

Related posts

Leave a Comment