ఆయన స్ఫూర్తి నేటి యువతకు ఎంతో అవసరం – భావితరాల కోసం ఆయన తన జీవితాన్ని దారపోశారు
నేతాజీ సుభాష్ చంద్రబోస్కు ఘన నివాళులు
ఆయన స్ఫూర్తి నేటి యువతకు ఎంతో అవసరం – భావితరాల కోసం ఆయన తన జీవితాన్ని దారపోశారు – ఈ రోజు ఆయనను స్మరించుకోవడం ఎంతో అదృష్టం – ముదిరాజ్ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి కాసాని వీరేష్ ముదిరాజ్ వెల్లడి.. హైదరాబాద్ 23 జనవరి (ఆదాబ్ హైదరాబాద్): భారత స్వాతం త్య్ర సమరయోధుడు, ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాప కుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా తెలంగాణ కబడ్డీ అసో సియేషన్ రాష్ట్ర అధ్యక్షులు, ముదిరాజ్ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి కాసాని వీరేష్ ముదిరాజ్ ఘన నివాళులు అర్పించారు. బ్రిటిష్ పాలనలో మగ్గిపోతున్న ప్రజలకు అండగా నిలిచి, బ్రిటిష్ వారిని గడగడలాడించిన భరతమాత ముద్దుబిడ్డ నేతాజీ అంటూ వీరేష్ కొనియాడారు. వికారాబాద్ జిల్లాలో యువజన నాయకులు ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఆయన నేతాజీ సుభాష్ చంద్రబోస్ చిత్ర పటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.. అనంతరం మాట్లాడుతూ .. నిరంకుశ బ్రిటిష్ పాలకులను ఎదిరించేందుకు తనదైన పంథాలో పోరాడిన దేశభక్తుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని వీరేష్ అన్నారు. స్వతంత్ర భారతావని కోసం ఆయన చేసిన పోరాటం అనన్య సామాన్యమని కీర్తించారు. దేశం కన్నా ఏదీ మిన్న కాదు అని చెప్పిన ఆ యోధుని స్ఫూర్తి ఎప్పటికీ అనుసరణీయమేనని వీరేష్ చెప్పుకొచ్చారు. నేతాజీ జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులు అర్పిస్తున్నట్లు కాసాని వీరేష్ ముదిరాజ్ తెలిపారు.
Read:Yadadri:జిల్లా వ్యాప్తంగా అలముకున్న మంచు