States | ప్రతిపక్షాలు లేని రాష్ట్రాలు… | Eeroju news

ప్రతిపక్షాలు లేని రాష్ట్రాలు...

ప్రతిపక్షాలు లేని రాష్ట్రాలు…

ఆ జాబితాలో చేరిన మహారాష్ట్ర

ముంబై, నవంబర్ 25, (న్యూస్ పల్స్)

States

భారత రాష్ట్రాల రాజధానులు, రాష్ట్రాల అవతరణ తేదీలు, ఆయా రాష్ట్రాల్లోని మొత్తం జిల్లాలుదేశంలోనే మహారాష్ట్ర ఒక్క రాష్ట్రమే కాదు.. ప్రతిపక్ష నాయకుడు లేని రాష్ట్రాల జాబితాలో ఆంధ్ర ప్రదేశ్, గుజరాత్, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, సిక్కిం లాంటి రాష్ట్రాలు ఉన్నాయి. ఈ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో అధికార పార్టీలు భారీ మెజారిటీతో విజయాన్ని నమోదు చేశాయి. మహారాష్ట్ర రాజీకాయాలు గత అయిదు సంవత్సరాలుగా థ్రిల్లర్ సినిమాకు తలపించే విధంగా ఉన్నాయి. ఇప్పుడు ఎన్నికలు ముగిసినా కొన్ని తేలని ప్రశ్నలు అలాగే మిగిలిపోయాయి. ఎన్నికల్లో ఆరు ప్రధాన పార్టీలు రెండు కూటములుగా తలపడ్డాయి. అయితే ఎన్నికల ఫలితాలు మాత్రం వార్ వన్ సైడే అన్నట్లు వెలువడ్డాయి. అధికార మహాయుతి పార్టీ భారీ మెజారిటీతో విజయం సాధించింది.

ఈ కూటమిలో బిజేపీ, అజిత్ పవర్ ఎన్సీపీ, షిండ్ శివసేన ఉండగా.. ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ కూటమిలో శరద్ పవార్ ఎన్సీపీ, ఉద్ధవ్ శివసేన, కాంగ్రెస్ ఉన్నాయి. అయితే ఎన్నికలు ముగిసిన ప్రతిపక్ష కూటమిలో ఏ పార్టీకి కూడా కనీసం 10 శాతం సీట్లు కూడా రాలేదు. దీంతో మూడు పార్టీలు కలిసి ప్రతిపక్ష నాయకుడిని ఎన్నుకుంటాయా? లేక ఆ పదవి కోసం కూడా పార్టీల మధ్య కుమ్ములాటలు ఉంటాయా? అనేది పెద్ద ప్రశ్నగా మారింది. మొత్తం 288 అసెంబ్లీ సీట్లలో అధికార కూటమికి 235 సీట్లు లభించాయి. ఇందులో బిజేపీ అత్యధికంగా 132 సీట్లు సాధించింది. దీంతో ముఖ్యమంత్రి పదవి బిజేపీ అభ్యర్థికే దక్కే అవకాశాలున్నాయి. మరోవైపు కొత్తగా కొలువుదీరిన అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి 16 మంది ఎమ్మెల్యేలు ఉండగా, శరద్ పవార్ ఎన్సీపీకి 10 సీట్లు మాత్రమే ఉన్నాయి.

ప్రతిపక్ష కూటమిలో అత్యధికంగా ఉద్ధవ్ బాల్ ఠాక్రే శివసేన పార్టీకి 20 సీట్లు లభించాయి. కానీ నిబంధనల ప్రకారం.. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా పొందడానికి ఒక పార్టీకి కనీసం 10 శాతం సీట్లు ఉండాలి. అయితే మొత్తం 288 అసెంబ్లీ సీట్లలో 29 సీట్లు ఒకే పార్టీ సాధించి ఉండాలి.ప్రతిపక్ష కూటమిలో ఏ పార్టీకి కూడా ఆ సంఖ్య దక్కలేదు. దీంతో 15వ మహారాష్ట్ర అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు లేకుండానే కొనసాగుతుంది. దేశంలో 16వ లోక్ సభ కూడా ప్రతిపక్ష నాయకుడు లేకుండా సాగింది. అయితే ప్రతిపక్ష కూటమిలోని అన్ని పార్టీల ఎమ్మెల్యేల సంఖ్య కలిపితే పది శాతం కంటే ఎక్కువగా ఉన్నా.. నిబంధనల ప్రకారం ఒకే పార్టీకి 10 శాతం సీట్లు తప్పకుండా లేకుంటే ప్రతిపక్ష హోదా దక్కదు. అందుకుగాను ఒకే పార్టీలోకి మిగతా పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు మారాల్సి ఉంటుంది.

ఇప్పటి రాజకీయాలలో అది కుదిరే పనికాదు. 18వ లోక్ సభ ఎన్నికల్లో బిజేపీ, ఎన్సీపీ, శివసేన కూటమి మహారాష్ట్రలో ఓడిపోయినా.. కేవలం అయిదు నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికల్లో విజయదుందుభి మోగించింది. బిజేపీకి అత్యధికంగా 132 సీట్లు, షిండే శివసేనకు 57 సీట్లు, అజిత్ పవార్ ఎన్సీపీకి 41 సీట్లు వచ్చాయని ఎన్నికల కమిషన్ తెలిపింది.ఈ ఎన్నికలు మహారాష్ట్ర రాజకీయాలో కురువృద్ధుడు అయిన శరద్ పవార్‌ ఘోర పరాజయం చవిచూశారు. ఇనేళ్ల ఆయన రాజకీయ ప్రస్థానంలో ఆయన పార్టీ కేవలం 10 సీట్లు మాత్రమే సాధించడం అవమానకరంగా మారింది. అలాగే మహారాష్ట్ర ఆత్మగౌరవానికి ప్రతీక బాలాసాహెబ్ ఠాక్రేకు వారుసుడైన ఉద్ధవ్ ఠాక్రే కు కూడా కేవలం 20 దక్కాయి. వీరిద్దరి పార్టీలు రెండుగా చీలి పోవడం వల్లనే వీరి రాజకీయ దుస్థితికి కారణమని రాజకీయ నిపుణులు చెబుతున్నారు.

ప్రతిపక్షాలు లేని రాష్ట్రాలు...

GST revenue | తెలుగు రాష్ట్రాలకు పెరిగిన జీఎస్టీ ఆదాయం | Eeroju news

Related posts

Leave a Comment