కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తో రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి భేటీ
న్యూఢిల్లీ
State Minister Komati Reddy met Union Minister Nitin Gadkari :
న్యూఢిల్లీలో కేంద్ర రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల శాఖా మంత్రి నితిన్ గడ్కరీ తో రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖామంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమావేశమయ్యారు. తరువాత కోమటిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో సుస్థిర పాలన అందిస్తున్నాం. 8 పార్లమెంట్ సీట్లు గెలుచుకున్నాం. రాష్ట్రంలో ఆర్ఆర్ఆర్ నిర్మాణంపై విశేష కృషి చేస్తున్నాం. గత ప్రభుత్వం యుటిలిటీ చార్జీలు కట్టమని కేంద్రానికి లేఖ రాయడంతో ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు వెనక్కి వెళ్లిన విషయం మీ అందరికి తెలుసని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక, నేను, ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కలిసి యుటిలిటీ ఛార్జీలు కడతామని లేఖ ఇవ్వడం జరిగింది. దీంతోపాటు రాష్ట్ర ఆర్ధిక ఇబ్బందులను నితిన్ గడ్కరీ కి వివరిస్తే వారే స్వయంగా యుటిలిటీ చార్జీలు చెల్లిస్తామని చెప్పారు. దీంతో ప్రాజెక్టు ముందుకు కదిలిన విషయం మీ అందరికి తెలిసిందే. ఎన్నికల మూలంగా ఆర్ఆర్ఆర్ మరియు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని 6 లేన్లుగా మార్చే పనులు కాస్త ఆలస్యం అయ్యాయి. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ప్రతీరోజు 60 వేల వాహనాలు ప్రయాణిస్తాయి. జీఎమ్మాఆర్ అనే సంస్థ టోల్ రోడ్డు పనులు తీసుకొని 2024 నాటికి పూర్తి చేయాల్సి ఉన్నప్పటికి ఇప్పటికి.. వారు వివిధ కారణాలు చూపించి పనులు పూర్తిచేయలేదు. దీనివల్ల ప్రతీరోజు అనేక ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతున్నారు, వికలాంగులుగా మారుతున్నారు. నేను ఎంపీగా ఉన్నప్పుడు రోడ్డుయొక్క పరిస్థితిని వివరిస్తే ప్రమాదాల నివారణకు 17 బ్లాక్ స్పాట్లు గుర్తించి.. వాటి మరమ్మత్తుల కోసం కేంద్రమంత్రి రూ. 375 కోట్ల రూపాయలను మంజూరీ చేసినప్పటికి.. పనులు చేయాల్సిన జీఎమ్మార్ సంస్థ రెండుసార్లు కోర్టుకు పోయి పనులు చేయకపోతే.. మూడోసారి టెండర్ పిలిచి నిన్ననే పనులు ప్రారంభించిన సంగతి మీ అందరికి తెలిసిందే. డిసెంబర్ లోపు టెంపరరీ రిలీఫ్ కోసం పనులు పూర్తి చేస్తామని అన్నారు.
ఒక్క బ్లాక్ స్పాట్స్ రిపేర్లు మాత్రమే కాకుండా 6 లేన్ల రోడ్డును నిర్మించాలని అధికారులతో కలిసి నేను స్వయంగా గడ్కరీగారికి వివరించడం జరిగింది. రీజినల్ రింగ్ రోడ్డు కోసం ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి సమీక్షిస్తానని గడ్కరీగారు చెప్పడం జరిగింది. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పెండింగ్ లో ఉన్న 16 రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చేందుకు మరోసారి విన్నవించడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించారు. వాటికి జాతీయ రహదారుల సంఖ్యను కేటాయించాలని విన్నవించడం జరిగింది. వారు భారతమాల క్రింద మంజూరీ చేస్తామని చెప్పారని అన్నారు.
కేంద్రమంత్రులకు రేవంత్ సూచనలు | Revanth Reddy advice to Central Ministers | Eeroju news