Srisailam | శ్రీశైలమల్లన్న భక్తులకు గుడ్ న్యూస్ | Eeroju news

శ్రీశైలమల్లన్న భక్తులకు గుడ్ న్యూస్

శ్రీశైలమల్లన్న భక్తులకు గుడ్ న్యూస్

శ్రీశైలం, నవంబర్ 37, (న్యూస్ పల్స్)

Srisailam

Special Buses To Srisailam : శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్, ప్రత్యేక బస్సులు నడుపుతున్న ఏపీఎస్ఆర్టీసీ-srisailam news in telugu apsrtc running special buses to mallanna temple ...కార్తీక మాసం కావడంతో అన్నీ దారులు జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం వైపే మళ్ళాయి. దీంతో మల్లన్న దగ్గరకు చేరాలంటే ట్రాఫిక్ సమస్యలను అధిగమించడం గగనమైపోతోంది. దేశ వ్యాప్తంగా శ్రీశైలం వస్తున్న శివయ్య భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా సమస్యను పరిష్కరించేందుకు రంగంలోకి దిగారు. ఈ నేపద్యంలో అధికారులతో మాట్లాడిన సీఎం శ్రీశైలం-హైదరాబాద్ హైవే రద్దీ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.

ట్రాఫిక్ సమస్యపై ఈరోజు అధికారులతో మాట్లాడిన ముఖ్యమంత్రి, శ్రీశైలం ఘాట్ రోడ్డుతో పాటు దేవాలయానికి వెళ్లే మార్గాల్లో రద్దీని చక్కదిద్దాలని సూచించారు.శ్రీశైలం ఘాట్ రోడ్ లో ఈ మధ్య కాలంలో రోజురోజుకూ వాహనాల రాకపోకలు పెరుగుతున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను నివారించేందుకు శాశ్వత పరిష్కారానికి సమగ్ర అధ్యయనం చేపట్టాలని అధికారులకు నిర్దేశించారు ముఖ్యమంత్రి. కార్తీక మాసం కావడంతో వేలాదిగా భక్తులు ఇతర రాష్ట్రాల నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వస్తున్నారని, అందువల్లే ట్రాఫిక్ పెరిగిందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

శ్రీశైలం ప్రాశస్త్యం తో పాటు పెద్ద ఎత్తున దేవాలయాన్ని అభివృద్ధి చేసే మాస్టర్ ప్లాన్ ను ప్రభుత్వం చేస్తోందని, ఈ నేపద్యంలో రానున్న రోజుల్లో పెరిగే రద్దీని దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. శ్రీశైలం-హైదరాబాద్ జాతీయ రహదారిపై తలెత్తుతున్న ట్రాఫిక్ సమస్యను స్వయంగా పరిశీలించి, పరిష్కార మార్గానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆర్‌ అండ్‌ బీ, ఎన్‌హెచ్‌ఏఐ అధికారులను ఆదేశించారు. అవసరమైతే పొరుగు రాష్ట్ర అధికారులతో సమస్యపై చర్చించి, సమన్వయంతో భక్తుల ఇబ్బందులను తొలిగించాలన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు.

శ్రీశైలమల్లన్న భక్తులకు గుడ్ న్యూస్

Yadagirigutta Temple | యాదగిరిగుట్టపై ఫోటోలు… వీడియోలు నిషేధం | Eeroju news

Related posts

Leave a Comment