జమ్ముకశ్మీర్‌లోని పలు ప్రాంతాలు మంచుమయం అయ్యాయి. ఎటువైపు చూసినా కనుచూపు మేరలో హిమపాతం దర్శనమిస్తోంది. మంచు దుప్పటి కప్పుకున్న కాశ్మీర్ అందాలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. ఎక్కడ చూసినా పర్యాటకుల సందడే కనిపిస్తోంది.
అందాల కశ్మీరం.. మంచులో నిండిపాయెరా..
శ్రీనగర్, జనవరి 2
జమ్ముకశ్మీర్‌లోని పలు ప్రాంతాలు మంచుమయం అయ్యాయి. ఎటువైపు చూసినా కనుచూపు మేరలో హిమపాతం దర్శనమిస్తోంది. మంచు దుప్పటి కప్పుకున్న కాశ్మీర్ అందాలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. ఎక్కడ చూసినా పర్యాటకుల సందడే కనిపిస్తోంది. అదే సమయంలో భారీ మంచు వర్షంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా.. రైల్వే ట్రాకులపై భారీగా మంచు పేరుకుపోవడంతో పలు ప్రాంతాలకు రైల్వే కనెక్టివిటీ దెబ్బతింది. దీంతో.. స్నో కట్టర్ అమర్చిన లోకోమోటివ్ ద్వారా ట్రాక్ క్లియరెన్స్ పనులు కొనసాగిస్తున్నారు రైల్వే అధికారులు. ట్రాకులపై పేరుకుపోయిన మంచును తొలగించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు.మంచు కారణంగా పలు ప్రాంతాల్లో రైలు సర్వీసులను నిలిపివేశారు. ఈ క్రమంలోనే.. శ్రీనగర్ రైల్వే స్టేషన్‌లో మంచు పెద్దయెత్తున కురుస్తుండడంతో రైల్వే ట్రాకులు మంచుతో నిండిపోయాయి. దాంతో.. అలెర్ట్ అయిన ఇండియన్ రైల్వే టీమ్.. స్నో కట్టర్లతో రంగంలోకి దిగింది. రైలు ఇంజిన్లకు స్నో కట్టర్‌లను అమర్చి ట్రాకులపై నిలిచిన మంచును తీసివేస్తున్నారు. కంటిన్యూ హిమపాతం ఉన్నప్పటికీ.. రైల్వే కనెక్టివిటీకి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. శ్రీనగర్ రైల్వే స్టేషన్‌లో లోకోమోటివ్ స్నోకట్టర్‌లతో మంచు తొలగిస్తున్న దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి.మరోవైపు.. ఎప్పటికప్పుడు మంచు తొలగిస్తుండడంతో జమ్మూ-శ్రీనగర్ హైవేపై వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి. ఇక.. మరో రెండు రోజులపాటు మంచు భారీగా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొండ ప్రాంతాలు, మైదాన ప్రాంతాల్లో దట్టమైన మంచు కురుస్తుందని వెల్లడించింది. ఎల్లుండి నుంచి జనవరి 6 మధ్యలో కశ్మీర్ డివిజన్‌లోని కొన్ని ప్రాంతాల్లో భారీ హిమపాతం కురిసే అవకాశం ఉందని చెప్పింది. ఇదిలావుంటే.. న్యూ ఇయర్ నేపథ్యంలో జమ్మూ కశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్‌లో మంచు అందాల మధ్య పర్యాటకులు ఎంజాయ్ చేశారు.
Read:Switzerland:స్విస్ లో కూడా బురఖా బ్యాన్