ఏపీలో ఘరానా మోసం జరిగింది. నెల్లూరు జిల్లాలోని ‘ఆర్ఆర్ ట్రేడర్స్ & ఆర్డర్స్ సప్లయర్స్’ డిస్కౌంట్ పేరిట జనాలనుంచి కోటి రూపాయలు దోచేశారు. గృహ అవసర వస్తువులు అది తక్కువ ధరలకు ఇస్తామంటూ తాత్కాలిక షాపులు ఏర్పాటు చేసుకున్న దుండగులు అడ్వాన్సులు కట్టించుకుని రాత్రికి రాత్రే పరారయ్యారు.
సిక్కోలులో ఘరానా మోసం
శ్రీకాకుళం, జనవరి 9
ఏపీలో ఘరానా మోసం జరిగింది. నెల్లూరు జిల్లాలోని ‘ఆర్ఆర్ ట్రేడర్స్ & ఆర్డర్స్ సప్లయర్స్’ డిస్కౌంట్ పేరిట జనాలనుంచి కోటి రూపాయలు దోచేశారు. గృహ అవసర వస్తువులు అది తక్కువ ధరలకు ఇస్తామంటూ తాత్కాలిక షాపులు ఏర్పాటు చేసుకున్న దుండగులు అడ్వాన్సులు కట్టించుకుని రాత్రికి రాత్రే పరారయ్యారు. గత నెల రోజులుగా కోట బజారులో అద్దెకు రూములు తీసుకొని ఫర్నిచర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, దబారులు, బిందెలు మొదలుగు వస్తువులపై భారీ డిస్కౌంట్ ఇస్తామని నమ్మించి కోటి రూపాయలకుపైగా నగదుతో పరారయ్యారు. ఈ మేరకు ‘RR ట్రేడర్స్’ డిసెంబర్, జనవరి నెలల్లో కొద్దికొద్దిగా కట్టించుకుని తీరా మొత్తం కట్టగానే పారిపోయారంటూ బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆడిపిల్లల పెళ్లిళ్ల కోసం దాచుకున్న నగదు సైతం తీసుకుని మోసం చేశారని కన్నీరుమున్నీరవుతున్నారు. కోట మండల కేంద్రంలో గత నెలరోజుల ముందు ఆర్ఆర్ ట్రేడర్స్ & ఆర్డర్స్ సప్లయర్స్ పేరుతో రెండు దుకాణాలను అద్దెకు తీసుకుంది. పదిమంది ఎంప్లాయిస్ తో గృహ అవసరాలకు అవసరమయ్యే వస్తువులన్నిటిని డిస్ ప్లేలో పెట్టి మార్కెట్ రేటుకంటే సగం రేటుకే వస్తుందంటూ జనాలను నమ్మించింది. మొదట కట్టిన వారికి 10 నుంచి 20 రోజుల్లో వస్తువులు ఇచ్చి నమ్మించారు. తక్కువ సమయంలోనే వస్తువులు ఇవ్వడంతో ఆ నోట ఈ నోట భారీ స్థాయిలో పబ్లిసిటీ పెరిగింది. అధిక జనాలు లక్షల రూపాయలు కట్టడంతో ఒక్కసారిగా సుమారు కోటి రూపాయల పైన నగదుతో రాత్రికి రాత్రే ఖాళీ చేసి వెళ్లిపోయారు. షాపుల్లో పనిచేయడానికి స్థానికంగా పెట్టుకున్న ఎంప్లాయిస్ వారికి ఫోన్లు చేసి వారి ఇళ్ల దగ్గరకు వెళితే వారు కనిపించకపోవడంతో విషయాన్ని బాధితులకు చేరవేశారు. విషయం తెలుసుకున్న బాధితులు భారీ స్థాయిలో దుకాణాల వద్ద ఆందోళనకు దిగారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.
Read:Vijayawada:లోకేష్.. ఇమేజ్.. భారీగానే పెరిగిందే