Srikakulam:శ్రీకాకుళంలో జీడీపప్పు రైతులకు టెన్షన్

Tension for Gdpapu farmers in Srikakulam

శ్రీకాకుళం జిల్లాలో పలాసజీడిపప్పుకు అంతర్జాతీయంగా పెరుంది. అందుకే ఈ పట్టణానికి ఆనుకొని ఉన్న పరిసర ప్రాంతాల్లో జీడిపంట పండిస్తారు. ఈసారి జీడి పంట ఆశాజనకంగా ఉందని రైతులు అంటున్నారు. అయితే జనవరిలో కురిసే మంచు, ఇతర చీడపీడలను తలుచుకొని రైతులు భయపడిపోతున్నారు.

శ్రీకాకుళంలో జీడీపప్పు రైతులకు టెన్షన్

శ్రీకాకుళం, జనవరి 24
శ్రీకాకుళం జిల్లాలో పలాసజీడిపప్పుకు అంతర్జాతీయంగా పెరుంది. అందుకే ఈ పట్టణానికి ఆనుకొని ఉన్న పరిసర ప్రాంతాల్లో జీడిపంట పండిస్తారు. ఈసారి జీడి పంట ఆశాజనకంగా ఉందని రైతులు అంటున్నారు. అయితే జనవరిలో కురిసే మంచు, ఇతర చీడపీడలను తలుచుకొని రైతులు భయపడిపోతున్నారు. అయితే చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే సమస్య ఉండదని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం జీడి పూత దశలో ఉంది. సాధారణంగా జీడిలో పూత అక్టోబర్‌, నవంబర్‌ నెలల్లో మొదలై జనవరి, ఫిబ్రవరి వరకు వస్తుంది. జీడిచెట్టుకు వచ్చిన పూతలో సుమారు 200 నుంచి 800 వరకు పూలు వచ్చిన ఆ స్థాయిలో మిగిలేది ఉండదు. జీడిపూతకు రావాలంటే సుమారు 25 రోజుల నుంచి 30 రోజులు పొడి వాతావరణం ఉండాలి. కానీ అదే టైంలో మంచు కురవడంతో ఏటా పూత నిలవడంలేదని రైతులు వాపోతున్నారు. మంచుకు తోడు టి దోమ జీడిమామిడిలో లేత చిగుళ్లు, పూత, పూత కాడలను, చిన్న కాయల రసం పీల్చడంతో నష్టం వాటిల్లితుంది. రసం పీల్చడంతో వచ్చే కాయలపై, చిగుర్లపై ఆ ప్రభావం పడుతోంది. దీంతో పంటనాశనమవుతుంది. దీనికి కొన్ని మందులు పిచికారీ చేస్తే సరిపోతుందని అధికారులు చెబుతున్నారుచెట్లు చిగురించినప్పుడు లీటరు నీటికి ల్యాండా సైహాలో త్రిన్‌ 0.6 మిల్లీ లీటర్లు లేదా అసిటామాప్రిడ్‌ 0.5 గ్రాములు కలిపి మొదట పిచికారీ చేయాలి. పూత కొమ్మలు కనిపించినప్పుడు రెండు, మూడు వారాల తరువాత ఇమిడాక్లోప్రిడ్‌ 0.6 మి.లీ లీటరు లేదా ప్రొఫెనోఫాస్‌ 1.5 మి.లీ, లీటర్‌ నీటికి కలిపి రెండోసారి పిచికారీ చేయాలి. కాయలు గోలీ సైజులో ఉన్నప్పుడు ల్యాండా సైహాలో త్రిన్‌ 0.6 మిల్లీ లీటర్లు లేదా ప్రొఫెనోఫాస్‌ 1.5 మి.లీ లీటర్‌ నీటికి కలిపి మూడోసారి పిచికారీ చేయాలి.

వీటితో పాటు వేపనూనెను తగిన మోతాదులో కలిపి వాడటం వలన మంచి ఫలితాలు వస్తాయంటున్నారు.జీడిపప్పు అంటే ఇష్టం లేని వాళ్ళు ఉండరు. ఇందులో పచ్చి జీడిపప్పుకి ఇంకా ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. తొలి దశలోనే పచ్చి జీడిపప్పుని ఎక్కువగా అమ్మకాలు చేస్తారు. వీటిని ఎక్కువగా నాన్‌వెజ్‌లో వేసుకుంటే మంచి రుచికరంగా ఉంటుంది. అందుకే దీనికి ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తారు. కొంతమంది రైతులు వీటిని పచ్చిపప్పు దశలోనే అమ్మడానికి ప్రారంభిస్తే… మరికొందరు పిక్కలను ఏరి ఎండబెట్టి అమ్ముతారు.శ్రీకాకుళం జిల్లాలో దాదాపు 60 వేల ఎకరాల్లో జీడి సాగు జరుగుతుండగా, అందులో ఉద్దాన ప్రాంతమైన వజ్రపుకొత్తూరు, పలాస, మందస, కవిటి, కంచిలి, సోంపేట, ఇచ్ఛాపురం మండలాల్లోనే 75 వేల ఎకరాల్లో జీడి తోటలున్నాయని జిల్లా ఉద్యానవనశాఖ లెక్కలు చెప్తున్నాయి. ఎకరాకు కనిష్ఠంగా 350, గరిష్ఠంగా 400 కిలోల పిక్కల దిగుబడి ఉంటుంది. జీడి పంటపై ఆధారపడి కనీసం లక్ష కుటుంబాలు ఆధారపడి జీవిస్తాయని అంచనా.జీడి పంట చేతికి రావాలంటే నవంబర్ నుంచి మే నెల వరకు కష్టపడాలి. ఎరువులు, క్రిమి సంహారక మందులు, ప్రోనింగ్ (కొమ్మలు కత్తిరించడం), పిక్క ఏరడం వంటివి పనులు చేయాలి. వాటన్నింటికి కూలీలు అవసరమవుతారు. వీటన్నింటికి లెక్కలేస్తే ఎకరాకు రూ.38 వేలకు పైగానే పెట్టుబడి అవుతుంది. అన్ని సవ్యంగా జరిగితే ఎకరాకు మూడు నుంచి నాలుగు బస్తాల జీడిపిక్క చేతికొస్తుంది.స్వాతంత్ర్యానికి ముందు నుంచే ఉద్దానం ప్రాంతంలో జీడి పంట పండించే వాళ్లు. ఇక్కడ పండే జీడిపప్పు చాలా నాణ్యమైంది. అందుకే విదేశాల్లో మంచి డిమాండ్ ఉంటుంది. పప్పు పలుకు సైజును బట్టి నాణ్యత నిర్ణయిస్తారు. మొదటి రకం జీడిపప్పు స్థానికంగా దొరకదు. ఇలా జీడి పప్పును 16 రకాలుగా గ్రేడింగ్ చేస్తారు. మొదటిది 180 గుడ్లు రకం. కిలోకు 180 వరకు మాత్రమే జీడిపప్పు వస్తుంది. ఇది వెయ్యిరూపాయల వరకు ఉంటుంది. దీన్నే ఎక్కువగా ఎగుమతి చేస్తుంటారు. రెండో రకం కిలోకు 210 మాత్రమే తూగుతాయి. దీన్ని 210 రకం అంటారు. నాణ్యత తగ్గే కొద్ది జీడిగుడ్లు సంఖ్య పెరుగుతూ ఉంటుంది. లాస్ట్‌ది జేహెచ్‌ రకం. ఇందులో పలుకులు ఉండనే ఉండవు. మొత్తం చీలిపోయిన జీడిపప్పు ఉంటుంది. ఇలాంటి పప్పును ప్రసాదాల్లో ఎక్కువగా వాడుతుంటారు. ఇవి కాకుండా బద్దలుగా ఇచ్చే జీడిపప్పులో కూడా చాలా రకాలు ఉంటాయి. ఇలా మొత్తంగా 16 రకాలు ఉద్దానంలో విక్రయిస్తుంటారు.
Read:Kadapa:అన్నమయ్య జిల్లాల్లో పురాతన విగ్రహాలు

Related posts

Leave a Comment