బుద్ధుని విగ్రహం చుట్టూ అసాంఘిక కార్యక్రమాలకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. నిత్యం రాత్రిపూట గుప్త నిధుల కోసం దుండగల తవ్వకాలలో విలువైన సంపద తరలిపోతుంది.
బుద్ధుని చుట్టూ అసాంఘీక కార్యకలాపాలా..
శ్రీకాకుళం, జనవరి 20
బుద్ధుని విగ్రహం చుట్టూ అసాంఘిక కార్యక్రమాలకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. నిత్యం రాత్రిపూట గుప్త నిధుల కోసం దుండగల తవ్వకాలలో విలువైన సంపద తరలిపోతుంది. పాలవలస, రావివలస గ్రామాల మధ్య 175 ఎకరాల్లో విస్తరించి ఉంది దంతపురి కోట. క్రీస్తుపూర్వం 261లో అశోక్ చక్రవర్తి చేసిన కళింగయుద్ధం తర్వాత ఈ క్షేత్రం ప్రాచుర్యంలోకి వచ్చినట్లు చరిత్ర చెబుతోంది.దంతపురి వంశానికి రాజైన కళింగ ఖారవేలుని కాలంలో ప్రాముఖ్యత సంతరించుకుంది ఈ దంతవరకు కోట కళింగ రాజుల రాజధానిగా దంతపురికి విశిష్ట స్థానం ఉంది. ఇక్కడ ఈ విగ్రహం హైదరాబాదులో ఉన్న విగ్రహం కి చాలా సంబంధాలు ఉన్నాయని స్థానికంగా చెబుతూ ఉంటారు.రాష్ట్ర పురావస్తుశాఖ అధికారులు 35సంవత్సరాల కిందట చేపట్టిన తవ్వకాల్లో దంతపురి ఆనవాళ్లు బయటపడ్డాయి. ఇక్కడి కోటలో 30 అడుగుల ఎత్తయిన ప్రాకారాలు, కోటకు నలుదిక్కులా ద్వారాలు ఉండేవని తెలిసింది.. అలా నిధులు కోసం ఎప్పుడు పడితే అప్పుడు తవ్వకాలు చేసేవారు ఇదంతా రాజులు రాజులు చే నిర్మించబడిన చాలా ప్రాంతాలు ఇక్కడ ఉన్నాయి ఇప్పుడు ఇల్లులు అవన్నీ కట్టుకొని ఇలా ఉండిపోయింది.దంతపురి రాజులు ఇక్కడ ఉండేవారు యుద్ధాన్ని ప్రకటించి అశోక్ చక్రవర్తి వస్తే ఇక్కడ బుద్ధుడు యొక్క కొన్ని ఆనవాళ్లు చూసి వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్లిపోయారు అంత చరిత్ర కలిగింది ఈ ప్రాంతం. ఇక్కడ నిధులు అయితే మాత్రం చాలా వరకు ఉన్నాయి ఎందుకు ఎందుకంటే నేను కూడా ఇది తవ్వకాలకు వెళ్లిన వాడిని ఈ తవ్వకాల్లో వెళ్లి కొన్ని బిందెలను కూడా తీసుకొని వచ్చి వేరే దగ్గర ఇంట్లో దాచేవాళ్ళం తర్వాత సెంట్రల్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి అవన్నీ పట్టుకొని వెళ్లిపోయారు మాకు తవ్వినందుకుగాను 50 రూపాయలు కూలి కూడా ఇచ్చారు.
ఇక్కడ మద్యం అనేది చాలా వరకు ఆ విగ్రహం వద్ద సేవిస్తూ ఉంటే మేము అడ్డుకట్ట వేసాం సరైన సెక్యూరిటీ కూడా ఇక్కడ ఎవరూ లేరు ఏం చేస్తాం తప్పని పరిస్థితుల్లో దాన్ని అలా ఉంచవే.యుద్ధం చేయడానికి వచ్చిన రాజు ఈ రాయి దగ్గరికి వచ్చి ఆశ్చర్యపోయాడు రెండు రాయలను ఇలా కలిపి కొట్టడంతో దీని కుట్టు రాయి అని అంటారు స్థానికంగా దీన్ని ఎవరైనా సరే ఏదైనా చేయాలనుకుంటే మరి రెండోసారి ఆ వ్యక్తి కనిపించారంట ఇక్కడ వారికి మూఢనమ్మకం.. దంతపురిలో ఉండే వస్తువులు చాలా అరుదైనవి ప్రపంచంలో ఎక్కడా లేని అరుదైన వస్తువులన్నీ కూడా ఇక్కడ దొరికే ఇవన్నీ కూడా హైదరాబాద్ మ్యూజియంలో ఉంచారు. సెంట్రల్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఏమైనా తలుచుకుంటేనే తప్ప దీన్ని అయితే ఏమీ చేయలేని పరిస్థితి. గుప్తనిధుల కోసం ఇప్పటికీ అక్కడ గ్రామస్తులు ఎక్కడ కడితే అప్పుడు తవ్వుతూ ఉంటారు కానీ ఎవరు ఏమి చేసేది ఉండదు. ప్రభుత్వం తరఫున మేము ఎన్నోసార్లు సిఫార్సులు పంపించినప్పటికీ అది తూతూ మంత్రంగానే అవుతుంది తప్ప ఇప్పుడు కూడా ఫేవర్ గా రాలేదు గుప్తనిధుల కోసం గానీ తవ్వితే చాలా నిధులు కిందన ఉండడం మాట వాస్తవం.టూరిజం శాఖ అధికారి నారాయణరావు ఏబీపీతో చెప్పారు.బుద్ధుడు నడిగాడిన ప్రాంతంలో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది ఈ ప్రాంతం కనీస సౌకర్యాలు కూడా లేని పరిస్థితి చోటుచేసుకుంది మందుబాబులకు అడ్డాగా మారింది. అభివృద్ధికి చేస్తే మాత్రం బుద్ధుని యొక్క అవశేషాలు ఉన్న ప్రాంతం కింద ఎంతో ఉపయోగాలుంటాయి ఇప్పటికీ ఆ ప్రాంతంలో తవ్వకాలు గాని చేస్తే ఎంతో నిధులు కూడా ఉన్నాయని చెప్పేసి స్థానికంగా చెబుతుంటారు కానీ ఆ ప్రాంతంలో చాలావరకు మద్యం సేవించి ఇతర అసాంఘిక కార్యకలాపాలకు కేరాపర్తిగా నిలిచింది. కానీ కొన్ని ప్రాంతాల్లో బుద్ధిని అవశేషాలు ఉన్నాయని అందరూ అంటూ ఉంటారు కానీ ఎటువంటి ఉపయోగం అయితే లేకుండా ఈ ప్రాంతాన్ని వదిలేశారు..బుద్ధుని అవశేషాలు.
ఈ ఉన్న ఈ ప్రాంతంలో చాలావరకు లంకె బిందెలతో కిందన నిధులు ఉన్నాయని ఒక అపోహనేది ఇప్పుడు నుంచే ఉంది అయితే గతంలో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఈ ప్రాంతాన్ని తవ్వించి చూడగా కొంత నిధులు వచ్చి రావడంతో ఆ సరుకునంతా కూడా హైదరాబాద్ మ్యూజియంలో పెట్టారని టూరిజం శాఖ అధికారి చెప్తున్నారు. ఆ తర్వాత ఆ గ్రామస్తులు ఆ నిధులు తవ్వకాలు ప్రారంభించి ఎప్పటికప్పుడు తగుతూ ఉండేవారు కొంతమందికి పూర్వం దొరికింది అనేవారు అయితే ఇప్పుడు కూడా దాన్ని తబకాలు చాలా వరకు చేస్తూ ఉంటే ఆ భూములు చాలా వరకు అన్యాక్రాంతులు కూడా అయిపోయాయి. ఈ ప్రాంతంలో ఎక్కడ ఇల్లు కట్టిన లోతుగా తవ్విన ఏదో ఒక ప్రాంతంలో నిధి దొరుకుతుంది అని ఒక అపోహ అయితే ఇప్పటికే నడుస్తుంది.ఒక పెద్ద కొండ రాయల మధ్య తెల్లటి దారంతో కుట్టినట్టు కనిపిస్తుంది ఈ ప్రాంతం ఈ ప్రాంతాన్ని కుట్టు రాయి అని కూడా పిలుస్తారు అయితే దీనికి ఒక చరిత్ర కూడా ఉంది. దీని కింద ఎన్నో గుప్త నిధులు ఉన్నాయని దీని తవ్వే వారు ఎవరైనా వస్తే వారు అక్కడే చనిపోతారని అక్కడ వారు నమ్ముతూ ఉంటారు అలా రెండు మూడు సార్లు జరిగాయి అని కూడా చెబుతూ ఉంటారు అయితే కొంత నిధులను ఇందులో దాచిపెట్టి అప్పటి ప్రకారంగా దాన్ని కొట్టారు కనుక కుట్టు రాయి అని కూడా అంటారు. కుట్టు రాయి ప్రాంతంలో ఎవరూ కూడా ఎక్కువసేపు ఉండరు ఎందుకంటే ఆ ప్రాంతం కొంచెం భయంగా ఉంటుంది అక్కడ ఏమో భయంకర జంతువు ఉందని వాళ్ళు నమ్మకం ఇక పక్కన పెడితే దాన్ని ఒకసారి తవ్వెందుకు ప్రయత్నం చేసిన ఒక వ్యక్తి మళ్ళీ కనిపించలేదని పూర్వీకులు చెబుతూ ఉంటారు అలా కొంతమంది కూడా ఎంతో ప్రయత్నాలు చేసినప్పటికీ ఎవరికీ కూడా దొరకలేదు దాన్ని ఎవరూ తప్పేందుకు సాహసం చేయలేదు.