Srikakulam:తమ్మినేని దారెటు

Tammineni Sitaram Pawan

మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం పవన్ నో చెప్పారా? జనసేనలో చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదా? అందుకే తమ్మినేని వెనక్కి తగ్గారా? వైసీపీలో కొనసాగుతానన్న ప్రకటన అందులో భాగమేనా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. ఇటీవల ఆమదాలవలస అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జిగా.. కొత్త నేతను నియమించారు జగన్.

తమ్మినేని దారెటు,,,,

శ్రీకాకుళం, జనవరి 2
మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం పవన్ నో చెప్పారా? జనసేనలో చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదా? అందుకే తమ్మినేని వెనక్కి తగ్గారా? వైసీపీలో కొనసాగుతానన్న ప్రకటన అందులో భాగమేనా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. ఇటీవల ఆమదాలవలస అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జిగా.. కొత్త నేతను నియమించారు జగన్. తన కుమారుడికి ఆ పదవి ఇవ్వాలని కోరారు తమ్మినేని. కానీ జగన్ ఓ ద్వితీయ శ్రేణి నేతకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. అప్పటినుంచి పార్టీకి దూరంగా ఉన్నారు తమ్మినేని. పార్టీ కార్యక్రమాల్లో సైతం పాల్గొనడం లేదు. ఇటీవల ఆయన కుటుంబంతో సహా జనసేన లో చేరతారని ప్రచారం పెద్ద ఎత్తున నడిచింది. కానీ ఉన్నట్టుండి తమ్మినేని తాను వైసీపీలోనే కొనసాగుతానని చెప్పడం విశేషం.సందిగ్ధతలో పడిపోయారు సీనియర్ నాయకుడు తమ్మినేని. టిడిపిలో ఒక వెలుగు వెలిగిన ఈ నాయకుడు తర్వాత కష్టాలు ఎదుర్కొన్నారు. జగన్ పుణ్యమా అని స్పీకర్ అయ్యారు. కానీ ఇప్పుడు ఆయన రాజకీయ జీవితానికి ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి.అయితే తమ్మినేని ఒకటి ఆశిస్తే.. జనసేన నుంచి మరో రిప్లయ్ వచ్చింది. తమ్మినేని సీతారాం తెలుగుదేశం పార్టీలోనే ఎదిగారు. పార్టీ ఆవిర్భావం నుంచి 2009 వరకు కొనసాగారు. తరువాత ప్రజారాజ్యంలో చేరారు. ఆ పార్టీ కాంగ్రెస్లో విలీనమైన తర్వాత తెలుగుదేశంలోకి తిరిగి వచ్చారు. కొద్దిరోజుల పాటే ఆ పార్టీలో కొనసాగారు.

వైసీపీ ఆవిర్భావం తర్వాత జగన్ వెంట అడుగులు వేశారు. కానీ ఇప్పుడు జగన్ ఆమదాలవలస అసెంబ్లీ నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పించడంతో మనస్థాపానికి గురయ్యారు. టిడిపిలో చేరేందుకు అవకాశం లేకపోవడంతో జనసేనలో చేరడానికి సిద్ధమయ్యారు. అయితే గత ఐదు సంవత్సరాలుగా స్పీకర్ గా ఉన్న తమ్మినేని వ్యవహార శైలిపై అనేక రకాల అభ్యంతరాలు ఉన్నాయి. ఈ విషయంలో చంద్రబాబు నుంచి అభ్యంతరాలు వెళ్లడంతో పవన్ సైతం పునరాలోచనలో పడ్డారు. అందుకే తమ్మినేని చేరికకు బ్రేక్ పడినట్లు ప్రచారం నడుస్తోంది.అయితే ఎట్టి పరిస్థితుల్లో ఆమదాలవలస అసెంబ్లీ టికెట్ ఈసారి తమ్మినేని కుటుంబానికి ఇచ్చే అవకాశం లేదు. కేవలం పెద్దన్న పాత్ర మాత్రమే పోషించాలని జగన్ స్పష్టంగా చెప్పినట్లు సమాచారం. అయితే ఇప్పుడు అనవసరంగా పార్టీ మారడం ఎందుకన్న అభిప్రాయంతో తమ్మినేని ఉన్నారు. కానీ కుటుంబ సభ్యులు మాత్రం వైసీపీలో కొనసాగకూడదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే తమ్మినేని వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నా.. ఐ కమాండ్ నుంచి ఎటువంటి స్పందన లేదు. తమ్మినేని వదులుకోవడానికి వైసిపి సిద్ధంగా ఉన్నట్లు స్పష్టమైంది. అదే సమయంలో పవన్ నుంచి సైతం గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో తమ్మినేని ఇరకాటంలో పడినట్టు కనిపిస్తున్నారు. అందుకే వైసీపీలోనే కొనసాగుతానని చెప్పినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Read:Vijayawada:కొడాలి నాని అరెస్ట్ తప్పదా

Related posts

Leave a Comment