ప్రారంభమైన సోషల్ వార్….
గుంటూరు, జూలై 8, (న్యూస్ పల్స్)
Social war started
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆశక్తికరంగా మారాయి. ఎన్నికలు ముగిసాయి. కాని అధికార పార్టీ్కి, వైసీపీకి మధ్య పోరు మాత్రం ఆగడంలేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఊరందరిది ఒక దారి అయితే ఉలిపికట్టెది మరో దారి అన్నట్టుగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరు ఉందని సోంత పార్టీ శ్రేణులే అనుకుంటున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికే జగన్ వైఖిరితో విసుగు చెందిన క్షేత్రస్థాయి వైసీపీ శ్రేణులు టీడీపీ గూటికి చేరినట్టు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ఎన్నికల వరకు పోటీ తత్వం, ఎన్నికలు ముగిసిన తరువాత మిత్రత్వం, అధికార పక్షం, విపక్షం కలిసి రాష్ట్ర అభివృధి గురించి చర్చించాలి, ఆ చర్చ హుందాగా ఉండాలి అని అప్పటి నేతలు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు నిరూపించారని, అయితే అంత గొప్ప నేత కడుపున పుట్టిన జగన్ మాత్రం అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుండి వైసీపీ టీడీపీపై బురద జల్లేందు యత్నిస్తోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఎక్కడ ఏం జరిగినా దానికి టీడీపీనే కారణం అంటూ సోషల్ మీడియాలో వైసీపీ ప్రచారం చేస్తోందని, అయితే దానికి టీడీపీ సైతం ధీటుగా ఘాటైన సమాధానం ఇస్తూ వచ్చిందని విశ్లేషకులు అంటున్నారు. అయితే టీడీపీపై ఆరోపణలు చేసినా ఎవరూ పట్టించుకోరు.కాని ప్రజా సంబంధమైన విషయాల్లో, రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన అంశాల్లోనూ వైసీపీ అసత్య ప్రచారం చేయండం నిజంగా బాధాకరం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
అటు రాజధాని లేక పెట్టుబడులు రాక, సంక్షేమ పథకాలతో రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది. ఈ నేసథ్యంలో అప్పటి ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాధ్ నుండి ఆంధ్రాకు రావాల్సిన ఆస్తులకు, ఆదాయంలో వాటలకు సంబంధించిన లావాదేవీలను చూసేందుకు నిన్న ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు.అయితే ఈ సమావేశంలో టీటీడీ నుండి వచ్చే ఆదాయంలో తెలంగాణ వాటా అడిగిందని వైసీపీ సోషల్ మీడియాలో విషప్రచారం చేసందని, అయితే టీడీపీ అలాంటిది ఏమీ లేదని స్పష్టం చేసిందని విశ్లేషకులు అంటున్నారు. రాష్ట్ర అభివృద్ధికి కూటమి యత్నిస్తుంటే.. అసత్య ప్రచారానికి వైసీపీ నేతృత్వం వహిస్తోందని వైసీపీ నెటిజన్స్ సైతం మండిపడుతున్నారు.
తెలుగు రాష్ట్రాల మధ్య లావాదేవీల విషయంలో చర్చలు జరిపేందుకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిన్న భేటీ అయ్యారు. అయితే అలా భేటీ కావడంపై వైసీపీ ట్విట్టర్ వేదికగా స్పంధించింది. గతంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంభందించిన వీడియోని వైసీపీ షేర్ చేసింది. అలానే ఆ వీడియోపై ‘ఏపీ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎందాకైనా వైయస్ జగన్ గారు వెళ్లిన విషయం మరిచిపోవద్దు టీడీపీ.. పదేళ్లు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉన్నా.. ఓటుకి నోటు కేసులో దొరికిపోయి మధ్యలోనే అన్నీ వదులుకుని అర్ధరాత్రి కరకట్టకి మీ చంద్రబాబు దగ్గరకి పారిపోయి వచ్చిన తీరు ఏపీ ప్రజలు ఎలా మర్చిపోగలరు?’ అంటూ రాసుకొచ్చింది.కాగా వైసీపీ పోస్ట్కు టీడీపీ ట్విట్టర్ వేదికగా స్పంధించింది. ‘మేం ఏమీ మర్చిపోలేదు.
హైదరాబాద్లో ఉన్న నీ ఆస్తులు కాపాడుకోవటానికి, పోలవరం మీటర్ ఎత్తు తగ్గించటానికి నువ్వు ఒప్పుకుంది మర్చిపోలేదు.. అరెస్ట్ కాకుండా కాళ్ళ మీద పడింది మర్చిపోలేదు.. భయంతో ప్రమాణ స్వీకారం కాకుండానే నువ్వు ఇచ్చేసిన ఏపి భవనాలు మర్చిపోలేదు.. లోటస్పాండ్ పడేయకుండా ఉండటానికి, రూ.6 వేల కోట్ల విద్యుత్ బకాయిలు వదిలేసిన సంగతి మర్చిపోలేదు.నువ్వు పెట్టిన బొక్కలకి రాయలసీమ రతనాల సీమ అయిపోయింది మరి.. గోదావరి జలాలు కృష్ణలో కలిసిపోయాయి మరి .. పోలవరం పూర్తయిపోయింది మరి… ఈ భ్రమల్లో నుంచి బయటకు రా జగన్..’ అంటూ టీడీపీ జగన్ను ట్విట్టర్ వేదికగా ఎద్దేవా చేసింది.
To bring social groups closer together… YCP TDP | సామాజిక వర్గాలను దగ్గరయ్యేందుకు… | Eeroju news