Slightly increased water level in Bhadradri | భద్రాద్రిలో స్వల్పంగా పెరిగిన నీటిమట్టం | Eeroju news

Slightly increased water level in Bhadradri

భద్రాద్రిలో స్వల్పంగా పెరిగిన నీటిమట్టం

భద్రాద్రి కొత్తగూడెం

Slightly increased water level in Bhadradri

భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం స్వల్పంగా పెరుగుతుంది. మూడు రోజుల క్రితం 4,లేదా 5 అడుగుల మేర ప్రవహించి స్వల్పంగా పెరిగిన గోదావరి నీటిమట్టం ఈరోజు ఉదయానికి 11.5 అడుగులు చేరి ప్రవహిస్తోంది.  కొన్ని రోజులుగా నీటిమట్టం తక్కువగా ఉండి ప్రవహించిన గోదావరి ఎగువన కురుస్తున్న వర్షాలకు స్వల్పంగా పెరుగుతూ వస్తోంది.

గోదావరి ఎగువ ప్రాంతంలో ఉన్న చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు ఎగువన ఉన్న ఛత్తీస్గఢ్ నుంచి వర్షపునీరు రావడంతో తాలిపేరు వద్ద అన్ని గేట్లను వదిలి దిగువన ఉన్న గోదావరి లోనికి నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం స్వల్పంగా పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం 11.5 అడుగులు ఉన్న గోదావరి నీటిమట్టం సాయంత్రానికి మరో రెండు అడుగులు  వరకు చేరవచ్చు అని సి డబ్ల్యూ సి అధికారులు తెలుపుతున్నారు. ఇప్పటికే జిల్లా అధికారులు గోదావరి వరద ముంపు ప్రాంతాలను గుర్తించి లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు.

గత కొన్ని రోజులుగా ఎడారిని తలపించిన గోదావరి నేడు ఎగువ నుంచి వస్తున్న వరద నీటి వల్ల జలకళను సంతరించుకుంది. గోదావరికి కొత్తనీరు చేరడంతో భద్రాచలం వద్ద గోదావరి పరివాహక ప్రాంతం వరద నీటితో కళ కళ లాడుతోంది. స్నాన ఘట్టాల ప్రాంతం వద్ద ఇసుకలో ఉన్న గోదావరి నీటిమట్టం క్రమంగా స్నానగట్టాల మెట్ల వద్దకు చేరుకుంటుంది.

Slightly increased water level in Bhadradri

 

Water on the hopes of leaders of four districts | నాలుగు జిల్లాల నేతల ఆశలపై నీళ్లు | Eeroju news

Related posts

Leave a Comment