Skill University | స్కిల్ యూనివర్శిటీ వడివడి అడుగులు | Eeroju news

స్కిల్ యూనివర్శిటీ వడివడి అడుగులు

స్కిల్ యూనివర్శిటీ వడివడి అడుగులు

హైదరాబాద్, అక్టోబరు 19, (న్యూస్ పల్స్)

Skill University

యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ.. ఈ యూనివర్సిటీకి పునాదులు పడ్డాయి. అయితే ఈ పునాదులు మరింత బలంగా ఉండేందుకు దిగ్గజ కంపెనీలు తమ వంతు సాయం చేస్తున్నాయి. గౌతమ్ అదానీ ఏకంగా 100 కోట్ల భారీ విరాళాన్ని ఇచ్చారు.సీఎం రేవంత్ రెడ్డి బ్రెయిన్ చైల్డ్ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ. ఇప్పుడీ యూనివర్సిటీ నిర్మాణానికి మరింత ఆర్థిక సాయం అందింది. ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ఏకంగా వంద కోట్ల విరాళాన్ని ప్రకటించారు ఈ స్కిల్ యూనివర్సిటీకి.

సీఎం రేవంత్ రెడ్డిని కలిసి స్వయంగా చెక్ అందించారు గౌతమ్ అదానీ.యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఆలోచన నుంచి పుట్టుకొచ్చిన ఆలోచన. ఇది పోటీ ప్రపంచం.. సత్తా ఉన్నవారే నెగ్గుకురాగలరు.. గెలవగలరు.. నిలవగలరు. ప్రస్తుతం చాలా మంది స్టూడెంట్స్‌ కాలేజీ నుంచి బయటికి వస్తున్నారు.. కానీ వారికి సరైన స్కిల్స్‌ లేకపోవడంతో మళ్లీ కోచింగ్‌ సెంటర్ల చుట్టూ తిరగాల్సి వస్తుంది. అందుకే ప్రస్తుతం మార్కెట్‌కు అవసరమైన స్కిల్స్‌ ఏంటో వాటిపై మాత్రమే ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్‌ సాధించే సత్తాను పెంచేందుకు సీఎం రేవంత్ రెడ్డి స్కిల్ యూనివర్సిటీని తెరపైకి తీసుకొచ్చారు.

ఇప్పటికే ఈ యూనివర్సిటీ ఏర్పాటుకు రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల వద్ద 57 ఎకరాల భూమిని కేటాయించారు. ఈ యూనివర్సిటీ చైర్మన్‌గా ఆనంద్ మహీంద్రా, కో చైర్మన్‌గా శ్రీనివాస సి రాజు ఉన్నారు. ఇప్పటికే ఆరు కోర్సులను కూడా డిజైన్ చేశారు. నాలుగు కోర్సుల అడ్మిషన్స్‌కు సంబంధించి తొలి నోటిఫికేషన్‌ కూడా రిలీజ్ చేశారు. వేరహౌస్ ఎగ్జిక్యూటివ్, కీ కన్‌జైనర్, ఫినిషింగ్ స్కిల్స్ ఇన్ నర్సింగ్ ఎక్సలెన్స్, ఫార్మా అసోసియేట్‌ కోర్సులకు అడ్మిషన్స్ ప్రారంభమ్యాయి. ఈ నెల 29 వరకు అప్లికేషన్స్‌ తీసుకోనున్నారు. అంతేకాదు నవంబర్ 4 నుంచి కోర్సులు ప్రారంభం కానున్నాయి.

హైదరాబాద్‌లోని ఇంజినీరింగ్ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా, నేషనల్ కాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ క్యాంపస్‌లో టెంపరరీగా క్లాస్‌లు నిర్వహించనున్నారు. మొత్తం 140 కంపెనీలు ఈ స్కిల్ యూనివర్సిటీలో ఇంప్లీడ్ అవుతున్నాయి. ఈ-కామర్స్, లాజిస్టిక్స్ రిటైల్‌లో సర్టిఫికేట్, డిప్లొమా కోర్సులను స్టార్ట్ చేయనున్నారు. వీటిల్లో ట్రైనింగ్ ఇచ్చేందుకు SBI, న్యాక్, డాక్టర్ రెడ్డీస్, TVAGA, అదానీ, సీఐఐ లాంటి సంస్థలు రెడీ అవుతున్నాయిపబ్లిక్, ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో ఈ స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటవుతోంది. ఇది ఇండిపెండెంట్‌గా పనిచేయనుంది.

మూడు నుంచి నాలుగేళ్ల డిగ్రీ కోర్సులతో పాటు 3 నుంచి 4 నెలల వ్యవధి నుంచి ఏడాది పాటు డిప్లమా కోర్సులు కూడా ఉంటాయి ఇందులో ఫస్ట్‌ ఇయర్‌లో 2 వేల మందికి ట్రైనింగ్‌ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు.నిజానికి ఈ యూనివర్సిటీ ఏర్పాటు అటు యువతకు.. ఇటు ఇండస్ట్రీస్‌కు విన్‌ విన్ సిట్యూవేషన్‌ లాంటిది. ఎందుకంటే ఇండస్ట్రీల అవసరాలకు అనుగుణంగా వారు ట్రైనింగ్‌ అండ్ సెలబస్‌ను డిజైన్ చేసుకోవచ్చు. డిమాండ్ ఉన్న రంగాలపైనే ఫస్ట్ ఫోకస్ చేస్తున్నారు. ఇలా పెద్ద పెద్ద రంగాలకు చెందిన వారి ఆర్థిక సాయంతో పాటు తోడ్పాటు ఉండటంతో ముందు ముందు మంచి ఫలితాలు రావడం కాయంగా కనిపిస్తోంది.

స్కిల్ యూనివర్శిటీ వడివడి అడుగులు

 

Tirupati | తిరుపతిలోనే స్కిల్ యూనివర్శిటీ | Eeroju news

Related posts

Leave a Comment