Silence among the pink leaders | గులాబీ నేతల్లో మౌనం… | Eeroju news

KT Rama Rao, Harish Rao

గులాబీ నేతల్లో మౌనం…

హైదరాబాద్, జూలై 12, (న్యూస్ పల్స్)

Silence among the pink leaders

పదేళ్ల అధికారం తర్వాత ప్రతిపక్షంలో కూర్చున్న భారత రాష్ట్ర సమితికి ఫిరాయింపుల భయం పట్టుకుంది. ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు చేజారిపోతున్నారు. ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. త్వరలో లెజిస్లేటివ్ పార్టీని విలీనం చేసుకుంటామంటూ కాంగ్రెస్ సవాల్ చేస్తోంది. ఇంకోవైపు పార్టీ అధినేత కేసీఆర్ చుట్టూ కేసుల ఉచ్చు బిగిసుకుంటోంది. మరోవైపు ఎమ్మెల్సీ కవిత ఇంకా బెయిల్ రాక జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి. రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో ఉన్న రెండు పార్టీలకు బీఆర్ఎస్ ప్రత్యర్థిగా ఉంది. దీంతో ఈ రానున్న రోజులు మరింత పార్టీకి గడ్డుకాలంగా కనిపిస్తుందని పార్టీ వర్గాలే గుసగుసలాడుకుంటున్నాయి.

ఇన్ని పరిణామాల మధ్య పార్టీ కీలక నేతలు కేటీ రామారావు, హరీష్ రావు వారం రోజుల పాటు ఢిల్లీలోనే మకాం వేశారు. కవిత మెయిల్ కోసం న్యాయవాదులతో చర్చలు అంటూ బయటకు చెప్తున్నా, అసలు కారణం వేరే ఉందని పార్టీలో తీవ్రంగా చర్చ జరుగుతుంది. బీజేపీతో పొత్తు వైపుగా బీఆర్ఎస్ వెళుతుందని మరో వైపు బయట ప్రచారం జరుగుతుంది. అసలు ఢిల్లీలో ఆ ఇద్దరు నేతలు ఎవరిని కలిశారు ఎవరితో సంప్రదింపులు జరిపారు అన్నదీ సస్పెన్స్ గానే మిగిలింది. అటు ఢిల్లీ నుంచి రాగానే ఆ ఇద్దరు నేతలు వరుసగా రెండు రోజుల నుంచి ఫామ్ హౌస్ లో ఉన్న కేసీఆర్ తో భేటీ అయ్యారు. రోజంతా ఢిల్లీ పరిణమాలపై చర్చలు జరుపారు. తాజా రాజకీయ పరిణామాలను బట్టి చూస్తే, ఇప్పుడు బీఆర్ఎస్ ముందున్న సవాలు రెండు.

ఒకటి పార్టీని కాపాడుకోవడం, పార్టీ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడం. రెండు కేసుల నుంచి బయటపడడం, కొత్తగా రాబోయే కేసులను ఎదుర్కోవడం. ఈ రెండు అంశాలపైనే రెండు రోజులుగా తీవ్రమైన చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ భవిష్యత్తును కాపాడుకుని, ఎమ్మెల్యేలు చేజారుతున్న కిందిస్థాయి క్యాడర్‌ను కాపాడుకోవాలని ఆలోచన. మరోవైపు ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలు తీవ్రతరం చేయాలి. కలిసి వచ్చే పార్టీలు సంఘాలతో ఒక వేదిక క్రియేట్ చేయాలనేది మరో ఆలోచనగా కనిపిస్తోంది.

వీటన్నిటితోపాటు ప్రభుత్వం వేసిన రెండు కమిషన్లతోపాటు రాబోయే రోజుల్లో మరిన్ని అంశాలపై ఇంకొన్ని కేసులు బీఆర్ఎస్‌కు ఛాలెంజ్‌గా మారనున్నాయి. వాటిని కూడా సమర్థవంతంగా ఎదుర్కొని అవినీతి మరకలు పార్టీకి అంటకుండా చూసుకోవడం ఇప్పుడున్న పెద్ద సవాల్. ఈ రెండు అంశాలపైన త్వరలో అత్యంత కీలక నిర్ణయాలు ఉంటాయని పార్టీలో అంతా భావిస్తున్నారు. ఇక తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారత రాష్ట్ర సమితిగా మారిన తర్వాతే డౌన్ ఫాల్ స్టార్ట్ అయిందని కార్యకర్తల అభిప్రాయం. పార్టీకి సంబంధించిన సీనియర్ లీడర్ వినోద్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. టెక్నికల్ గా పార్టీ పేరును ఇప్పటికిప్పుడు మార్చే అవకాశం లేకున్నా, ఇందుకోసం ఓ ప్రత్యామ్నాయ ఆలోచన చేయాలని కూడా గులాబీ అధిష్టానం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

 

KT Rama Rao, Harish Rao

 

BRS chief KCR seems to have good days coming | గులాబీ కలిస్తొస్తున్న కాలం | Eeroju news

Related posts

Leave a Comment