సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ లో కందుల కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ మను చౌదరి అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్ ఆర్డీవో సదానందం, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, జిల్లా మార్కెటింగ్ అధికారి నాగరాజు, సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ సెక్రటరీ వెంకటయ్య ఇతర అధికారులు, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గోన్నారు.
సిద్దిపేట మార్కెట్ లో కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం
సిద్దిపేట
సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ లో కందుల కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ మను చౌదరి అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్ ఆర్డీవో సదానందం, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, జిల్లా మార్కెటింగ్ అధికారి నాగరాజు, సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ సెక్రటరీ వెంకటయ్య ఇతర అధికారులు, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గోన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ సిద్దిపేట మార్కెట్ లో కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభ చేసుకున్నాం. కందుల మద్దతు ధర 7550 రూపాయలతో ప్రభుత్వం కందుల కొనుగోలు చేస్తుంది. రైతులు కందులను మద్దతు ధరకు అమ్ముకోవాలి. గతంలో వడ్లు పత్తి సన్ ఫ్లవర్ కొనుగోలు కేంద్రాలు సమర్థవంతంగా చేశాం. వడ్ల కొనుగోలు చేసిన 48 గంటలలో పేమెంట్ చేశాం. సన్న వడ్ల కు 500 బోనస్ ఇచ్చాం. జనవరి 26 నుండి వ్యవసాయ యోగ్యమైన భూములు రైతు భరోసా ఇస్తున్నాం రైతు భరోసా 12 వేలకు పెంచాం. భూమిలేని ఉపాధి కూలీలకు 12 వేలు ఇస్తున్నాం. ఇందిరమ్మ ఇళ్ల సర్వే జరుగుతుంది ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు పారదర్శకంగా జరుగుతుంది. నియోజకవర్గానికి 3500 ఇళ్లు ఇస్తున్నాం. గత 10 సంవత్సరాలుగా రేషన్ కార్డులు లేవు, కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నాం. పేర్ల మార్పిడి చేసుకోవాలనుకునే వారు చేసుకోవచ్చు. రైతు భరోసా కింద గతంలో ఉన్న దానిని 12 వేలకు పెంచాం. 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేశాం. రైతు సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టాం. త్వరలోనే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇక్కడ పర్యటించి అయిల్ ఫాం సాగు పై రైతులకు అవగాహన కల్పిస్తారని అన్నారు
Read:Hyderabad:సీఎం రేవంత్ ఢిల్లీలో కొత్త నాటకాలు మొదలుపెట్టారు