హుస్నాబాద్ లో మీడియా సమావేశంలో బిఆర్ఎస్, బిజెపిపై మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం 4 వ తేది జరిగిన క్యాబినెట్ లో తెలంగాణ రైతులకు ఎన్నికల ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా, భూమిలేని పేదలకు 12 వేలు జనవరి 26 నుండి అమలు చేయాలని నిర్ణయించింది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అమలు చేస్తున్నాం.
బిఆర్ఎస్, బిజెపిపై మంత్రి పొన్నం మండిపాటు
సిద్దిపేట
హుస్నాబాద్ లో మీడియా సమావేశంలో బిఆర్ఎస్, బిజెపిపై మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం 4 వ తేది జరిగిన క్యాబినెట్ లో తెలంగాణ రైతులకు ఎన్నికల ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా, భూమిలేని పేదలకు 12 వేలు జనవరి 26 నుండి అమలు చేయాలని నిర్ణయించింది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అమలు చేస్తున్నాం. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ,500 కీ గ్యాస్ అందిస్తున్నామని అన్నారు.
2 లక్షల రూపాయల వరకు రైతు రుణమాఫీ చేశాం. 40 శాతం డైట్ చార్జీలు పెంచాం. 55 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. నిన్న రైతు భరోసా ఇస్తామని ప్రకటించాం.. దానిని 12 వేలకు పెంచాం. భూమి లేని పేదలకు సంవత్సరానికి 12 వేలు ఇవ్వాలని నిర్ణయించాం. 10 సంవత్సరాలుగా బిఆర్ఎస్ ఒక్క రేషన్ కార్డులు ఇవ్వలేదు. కొత్త రేషన్ కార్డులు ఇస్తాం. బీజేపీ, బీఆర్ఎసక కలిసి ఒకే ఎజెండా తో రాజకీయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు.తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలని అన్నారు. రైతు సంఘం నాయకుడు దల్జీర్ సింగ్ 20 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు.. మీ నిర్వాకం వల్లే కదా. రైతు వ్యతిరేక చట్టాలు తెస్తున్నారు. మీరు పాలిస్తున్న రాష్ట్రాల్లో సన్న వడ్లకు 500 బోనస్ ఇస్తున్నారా…? 2 లక్షల రుణమాఫీ పూర్తి చేశారా. కిషన్ రెడ్డి, బండి సంజయ్, కేటీఆర్ ఒకే స్వరం తో మాట్లాడుతున్నారు. పీఎం కిసాన్ సమ్మన్ యోజన కింద అప్లై మళ్ళీ చేసుకోవాలా. రైతులను అవమానిస్తుంది మీరా..మేమా..? ఐటీ కడుతున్న వాళ్ళకి లేదు..ప్రభుత్వ ఉద్యోగులకు కిసాన్ సమ్మాన్ మీరు ఇవ్వడం లేదని అన్నారు.
రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఇస్తామన్న ప్రతి హామీ అమలు చేశాం. బిఆర్ఎస్ హయాంలో ఆర్థిక పరిస్థితుల పై అనేక సందర్భాల్లో శ్వేత పత్రం అడిగాం..అప్పుడు ఏనాడు చెప్పలేదు.పైన పటారం లోనా లోటారం అన్న విధంగా వ్యవహరించారు. మీరు ఇచ్చిన హామీల పై ఒకసారి సమీక్ష చేసుకోండి మేము చర్చకు సిద్ధం. .ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి చూస్తున్నారు. మేము మాట తప్పమా లేదా ప్రజలు నిర్ణయిస్తారు. గుట్టలకు ,రోడ్లు ,రాళ్ళు,వ్యవసాయ యోగ్యం లేని భూములకు రైతు భరోసా ఇవ్వాలని చెప్తుందా, బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు సమాధానం చెప్పాలని అన్నారు. యూపీఏ ప్రభుత్వంలో 72 వేల కోట్ల రుణమాఫీ చేశాం. నరేంద్ర మోడీ డ్రెస్సింగ్ మీద తప్ప దేశం కోసం ఏం నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ ప్రభుత్వం కి రైతుల మీద ప్రేముంటే మేము ఇస్తున్న రైతు భరోసా కి మీరు 12 వేలు జమ చేయండి. తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ప్రయోజనాలకు ఏం చేస్తారో చెప్పండి. మేము రైతుల కోసం చేస్తున్న సన్న వడ్లకు 500 బోనస్ ,భూమి లేని పేదలకు 12 వేలు ,రైతు రుణమాఫీ మీరు పాలిస్తున్న రాష్ట్రాల్లో ఎక్కడైనా అమలు చేశారా అని ప్రశ్నించారు.
Read:Nalgonda:నాగార్జున సాగర్, శ్రీ శైలం బ్యారేజ్ లు డ్యామేజ్ లు