Siddipet:పెట్రోల్ పంపును ప్రారంభించిన కలెక్టర్, కమిషనర్

telangana-petrol-pump-inaugurated

Siddipet:పెట్రోల్ పంపును ప్రారంభించిన కలెక్టర్, కమిషనర్:తెలంగాణ రాష్ట్ర పోలీస్ వెల్ఫేర్ సొసైటీ ద్వారా సిద్దిపేట లో నూతనంగా నిర్మించిన ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంపును జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరి..పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ బుధవారం ప్రారంభించారు.

పెట్రోల్ పంపును ప్రారంభించిన కలెక్టర్, కమిషనర్

సిద్దిపేట
తెలంగాణ రాష్ట్ర పోలీస్ వెల్ఫేర్ సొసైటీ ద్వారా సిద్దిపేట లో నూతనంగా నిర్మించిన ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంపును జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరి..పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ బుధవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ ఇరువులు మాట్లాడుతూ. తెలంగాణ స్టేట్ పోలీస్ వెల్ఫేర్ సొసైటీ ద్వారా సిద్దిపేట పట్టణం పొన్నాల గ్రామ శివారు పోలీస్ కన్వెన్షన్ సెంటర్ ఎదురుగా హనుమాన్ టెంపుల్ పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంపును ప్రారంభించడం జరిగిందని తెలిపారు. పోలీస్ పెట్రోల్ పంపులో డీజిల్, పెట్రోల్ ఎలాంటి కల్తీ లేకుండా క్వాలిటీ క్వాంటిటీగా ఉంటుందని తెలిపారు. సిద్దిపేట పట్టణ ప్రజలు ప్రముఖులు వ్యాపారస్తులు చుట్టుపక్కల గ్రామాల వారు ప్రజలు పెట్రోల్, డీజిల్ పోసుకొని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

పోలీస్ పెట్రోల్ పంపు ద్వారా వచ్చే ఆదాయం పోలీస్ డిపార్ట్మెంట్ సిబ్బంది యొక్క వెల్ఫేర్ కార్యక్రమాలకు ఉపయోగించడం జరుగుతుందని తెలిపారు.
పోలీస్ కన్వెన్షన్ ద్వారా వచ్చే ఆదాయం కూడా పోలీసు వెల్ఫేర్ సొసైటీకి వినియోగించడం జరుగుతుందని తెలిపారు.
పోలీస్ కన్వెన్షన్ సెంటర్ పోలీస్ కుటుంబ సభ్యులకు మెంటెనెన్స్ ఖర్చులతో మరియు ఇతరులకు అందుబాటులో ఉండే విధంగా ధరలు నిర్ణయించడం జరిగిందని పోలీస్ కన్వెన్షన్ సెంటర్ అద్భుతంగా ఆహ్లాదకరంగా సుశాలమైన పార్కింగ్ తో చాలా బాగుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్, ఏసీపీలు మధు, పురుషోత్తం రెడ్డి, సతీష్, రవీందర్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు విష్ణు ప్రసాద్, రాజేష్ ఎస్బి ఇన్స్పెక్టర్ కిరణ్, శ్రీధర్, శ్రీధర్ గౌడ్, సిసిఆర్బి ఇన్స్పెక్టర్ రామకృష్ణ, ఇన్స్పెక్టర్లు,సిఐలు వాసుదేవరావు, ఉపేందర్, విద్యాసాగర్, తెలంగాణ రాష్ట్ర పోలీస్ సంఘం ఉపాధ్యక్షులు రవీందర్ రెడ్డి, సీసీ నితిన్ రెడ్డి, మరియు పోలీస్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Read more:New Delhi:న్యూఢిల్లీ అంబేద్కర్ ఆడిటోరియం లో జరిగిన బిసి మేధావుల సదస్సు

Related posts

Leave a Comment