సిద్దిపేట లో గోదా కళ్యాణం సుదర్శన యాగం కార్యక్రమం లో పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు
సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాల గ్రామ పరిది లో ఉన్న వికాస తరంగిణి ఆధ్వర్యంలో వేద భవన్ లో జరిగిన ధనుర్మాసం సందర్బంగా నిర్వహించిన శ్రీ గోదా దేవి కళ్యాణం, శ్రీ సుదర్శన యాగం లో పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు.
గోదా దేవి ని కొలిచే పవిత్ర మాసం ధనుర్మాసం
మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు
సిద్దిపేట లో టిటిడి ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయం
సిద్దిపేట లో 45 లక్షల తో వికాస తరంగిణి వేద భవన్
సిద్దిపేట లో వికాస తరంగిణి బలోపేతం కు కృషి చేస్తా.
త్వరలో సిద్దిపేట కు చిన్నజీయర్ స్వామి వారిని తీసుక వస్తా
సిద్దిపేట ఆధ్యాత్మిక ధార్మికత కు నెలవు.
సిద్దిపేట లో గోదా కళ్యాణం సుదర్శన యాగం కార్యక్రమం లో పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు
సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాల గ్రామ పరిది లో ఉన్న వికాస తరంగిణి ఆధ్వర్యంలో వేద భవన్ లో జరిగిన ధనుర్మాసం సందర్బంగా నిర్వహించిన శ్రీ గోదా దేవి కళ్యాణం, శ్రీ సుదర్శన యాగం లో పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. ఈ సందర్బంగా హరీష్ రావు మాట్లాడుతు సిద్దిపేట గొప్ప ఆధ్యాత్మిక, ధార్మికతకు నెలవు అని, సిద్దిపేట లో కరీంనగర్ స్థాయి లో వేద భవన్ వికాస తరంగిణి భవనం అద్భుతంగా ఏర్పాటు చేసుకున్నామన్నారు. ఎకరం ప్రభుత్వ స్థలం లో 45లక్షలతో అద్భుతం గా నిర్మించుకున్నామని, ప్రభుత్వ స్థలం లో ఇంత పెద్ద భవనం ఏర్పాటు కావడం రాష్ట్రం లోనే మొదటిదని. ఈ భవనాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. సిద్దిపేట లో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కోమటి చెరువు ప్రాంతం లో తిరుపతి శ్రీవారి ఆలయాన్ని నిర్మించుకుంటున్నామని త్వరలోనే 10కోట్లు టిటిడి నుండి మంజురు అవుతాయని చెప్పారు. వికాస తరంగిణి ని మరింత బలోపేతం చేసుకుందాని సిద్దిపేట కు చిన్న జీయర్ స్వామి వారిని తీసుకొచ్చి ఈ భవనాన్ని ఘనంగా ప్రారంభం చేసుకుందామని చెప్పారు. ధనుర్మాసం గోదా దేవి కి ఎంతో ప్రత్యేక మాసమని, నెల రోజుల పాటు గోదా దేవి కోలుస్తామని చెప్పారు. ఈ సందర్బంగా సుదర్శన యాగం పూర్ణహుతి కార్యక్రమం, గోదా దేవి కల్యానోత్సవం లో పాల్గొన్నారు ఈ సందర్బంగా వేద పండితులు, వికాస తరంగిణి నిర్వహకులు ఆశీర్వదించారు.