Sheikh Hasina | బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనాపై అరెస్టు వారెంట్‌ జారీ | Eeroju news

బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనాపై అరెస్టు వారెంట్‌ జారీ

బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనాపై అరెస్టు వారెంట్‌ జారీ

న్యూ డిల్లీ అక్టోబర్ 18

Sheikh Hasina

బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనాకు మరో షాక్ తగిలింది. ఇటీవల బంగ్లాదేశ్ లో జరిగిన అల్లర్లు హింసాత్మకంగా మారడంతో ఆమె దేశం విడిచి పారిపోయిన సంగతి తెలిసిందే. ఆందోళనకారులు ఆమె నివాసంపై దాడి చేస్తారని తెలుసుకున్న హసీనా రహస్యంగా ప్రత్యేక హెలిక్యాప్టర్ లో దేశం వడిచి భారత్ కు వచ్చి తలదాచుకుంటోంది. దీంతో హసీనా ప్రభుత్వం అర్థాంతరంగా కుప్పకూలిపోయింది.

ప్రస్తుతం ఆమె ఇండియాలోనే ఉన్నారు. దేశ పాలనను చేతుల్లోకి బంగ్లా ఆర్మీ.. పరిస్థితులను చక్కదిద్దేందుకు చర్యలు తీసుకుంది. అనంతరం నోబెల్ విజేత మహ్మద్‌ యూనస్‌ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అయితే, మాజీ ప్రధాని షేక్‌ హసీనాను బంగ్లా ప్రభుత్వం అరెస్టు చేసేందుకు సిద్ధమైంది.

ఈక్రమంలోనే నవంబరు 18లోగా ఆమెను అరెస్టు చేసి తమ ఎదుట హాజరు పరచాలని బంగ్లాదేశ్‌ ఇంటర్నేషనల్ క్రైమ్స్‌ ట్రైబ్యునల్‌ చీఫ్‌ ప్రాసిక్యూటర్ మహమ్మద్‌ తజుల్‌ ఇస్లాం అధికారులను ఆదేశించారు.

బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనాపై అరెస్టు వారెంట్‌ జారీ

Hydra | హైడ్రా బాధితుల దీక్ష | Eeroju news

Related posts

Leave a Comment