రెసిడెన్షియల్ హాస్టల్లో నెలకు ఒకసారైనా జిల్లా కలెక్టర్లు బస చేయవలసిందే
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి..
హైదరాబాద్
Shanti Kumari, Chief Secretary to Govt
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి కీలక ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్లు తమ పరిధిలోని రెసిడెన్షియల్ పాఠశాలలు, హాస్టళ్లల్లో కనీసం నెలకు ఒకసారైనా నిద్ర చేయాలని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం రాత్రి సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే స్కూల్స్, హాస్టల్స్ తనిఖీల్లో తీసుకున్న చర్యలను డైరీలో రాయాలని పేర్కొన్నారు. రాత్రి హాస్టళ్లలో కలెక్టర్లు బస చేసి పరిస్థితులు తెలుసుకో వాలని స్పష్టమైన ఆదేశాలి చ్చారు.
కాగా గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలోని అనేక పాఠశాలలు, రెసిడె న్షియల్ పాఠశాలు, గురుకు లాల్లో ఫుడ్ పాయిజన్, విష జ్వరాలు, సౌర్యాల కొరతపై ఆరా తీయాలని అధికారు లకు సూచించారు.
విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలతో పాటు ప్రతిపక్షాలు నిరసన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీఎస్ ఆదేశాలకు ప్రాధాన్యత నెలకొంది.
Unstoppable idol controversy revanthreddy and KTR | ఆగని విగ్రహ వివాదం | Eeroju news