టెక్కలి
శ్రీకాకుళం జిల్లాలో టెక్కలిలోని “ఇన్ ఫాంట్ జీసస్” స్కూల్లో గురువారం విద్యా శాఖాధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. టెక్కలి డిప్యూటీ డీఈఓ పీ.విలియమ్స్, ఎంఈఓ డీ.తులసీరావు లు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా 1 నుంచి 10వ తరగతులకు సంబంధించి ప్రైవేట్ పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్, నోటుపుస్తకాలు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు వాటిని పరిశీలించి సీజ్ చేసినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.