చంద్రబాబు తిరుమల పర్యటనకు పటిష్టమైన భద్రత | Security tight for Chandrababu’s visit to Tirumala | Eeroju news

తిరుపతి

బుధవారం ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత చంద్రబాబు నాయుడు తిరుమల కు వస్తున్న నేపధ్యంలో పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నారు. బుధవారం తిరుమలకు చేరుకుని గురువారం ఉదయం కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకోనున్నారు.

ఈ నేపథ్యంలో ఈరోజు జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయం నుండి తిరుపతి మీదుగా ఘాట్ రోడ్లు, తిరుమల, గాయత్రి అతిథిగృహం,వైకుంఠంకాంప్లెక్స్, శ్రీవారి ఆలయం వరకు రోడ్డు మార్గాన తనిఖీలు చేపట్టారు. విమానాశ్రయం లోపల, విఐపి గేటు, పార్కింగ్ ప్రదేశం, గ్యాలరీలను, పరిశీలించి పోలీసు, ఏర్పోర్ట్ భద్రతా సిబ్బంది పాటించవలసిన బందోబస్తు ప్రణాళికను అధికారులకు వివరించారు. కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు నిర్దేశిత పార్కింగ్ ప్రదేశంలోనే వాహనాలను పార్కింగ్ చేపించి యాత్రికులకు ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

అనంతరం  ముఖ్యమంత్రి పర్యటించనున్న ప్రదేశాలలో జిల్లా ఎస్పీ  క్షేత్రస్థాయిలో తనిఖీలు చేసి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేయాలని, ఇతర శాఖల అధికార యంత్రాంగాన్ని సమన్వయ పరుచుకుంటూ ముందుకు వెళ్లాలని పోలీస్ అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో  తిరుమల తిరుపతి దేవస్థానం చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్  నరసింహ రాజు ఐపీస్ గారు ,అదనపు ఎస్పీ  వెంకట్రావు పరిపాలన, డిఎస్పీలు వెంకటాద్రి ఎస్బి, భవ్య కిషోర్ రేణిగుంట, రమణయ్య డిఎస్డబ్ల్యు, సిఐలు, ఆర్ఐలు, ఎయిర్పోర్ట్ అధికారులు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Related posts

Leave a Comment