హకీంపేటలోని జాతీయ పారిశ్రామిక భద్రత విపత్తు నిర్వహణ సంస్థ లో సిఐఎస్ఎఫ్ కానిస్టేబుళ్ళ పాసింగ్ అవుట్ పరేడ్ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. నిసా సంస్థలో సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ గా శిక్షణ పూర్తి చేసుకున్న 1300 మంది కానిస్టేబుళ్లు కవాతు నిర్వహించారు.
సీఐఎస్ఎఫ్ జవాన్ల కవాతు
సికింద్రాబాద్..
హకీంపేటలోని జాతీయ పారిశ్రామిక భద్రత విపత్తు నిర్వహణ సంస్థ లో సిఐఎస్ఎఫ్ కానిస్టేబుళ్ళ పాసింగ్ అవుట్ పరేడ్ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. నిసా సంస్థలో సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ గా శిక్షణ పూర్తి చేసుకున్న 1300 మంది కానిస్టేబుళ్లు కవాతు నిర్వహించారు. సిఐఎస్ఎఫ్ డిజి రాజ్విందర్ సింగ్ సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. 31వ బ్యాచ్ కు చెందిన కానిస్టేబుల్లు అత్యాధునిక ఆయుధాలు, గ్లాక్ పిస్టల్ లాంటి ఆయుధాలు వినియోగంలో పూర్తిస్థాయిలో తర్ఫీదు పొందారు. ఈ సందర్భంగా వారు చేసిన విన్యాసాలు చూపరులను విశేషంగా అలరించాయి. అగ్నిమాపక శాఖలో పని చేయనున్న కానిస్టేబుళ్లు 27 వారాలపాటు పలు రకాల అంశాలకు శిక్షణ పొందారు. కానిస్టేబుల్ల మాక్ డ్రిల్ విన్యాసాలు అలరించాయి. పాసింగ్ ఔట్ పరేడ్ లో శిక్షణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన కానిస్టేబుళ్లకు పురస్కారాలు అందచేశారు. ఈ సందర్భంగా సిఐఎస్ఎఫ్ డిజి రాజ్విందర్ సింగ్ మాట్లాడుతూ పాసింగ్ ఔట్ పరేడ్ చేసి ఉద్యోగాల్లో చేరనున్న కానిస్టేబుళ్లకు శుభాకాంక్షలు తెలిపారు. అగ్నిమాపక విభాగంలో సేవలందించే విషయంలో ప్రాణాలకు ఎదురొడ్డి పోరాడాలని నూతన క్యాడేట్లలో స్ఫూర్తిని నింపారు. అగ్నిమాపక విభాగాన్ని పటిష్టపరిచామని దేశంలో విపత్తు నిర్వహణలో కీలక భూమిక పోషించాలని పిలుపునిచ్చారు. నైపుణ్యం శిక్షణ శారీరక దారుడ్యాన్ని కాపాడుకుంటూ నీతి నిజాయితీ, దేశభక్తి భావంతో పనిచేయాలని సూచించారు. ప్రతిమాపక విభాగంలో సైతం అధునాతన విజ్ఞానాన్ని తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. కానిస్టేబుల్ కు అత్యద్భుతమైన శిక్షణ అందించిన నిసా కు అభినందనలు తెలిపారు.
Read:Sangareddy:భవిష్యత్తు ఇంధనం గా గ్రీన్ హైడ్రోజన్ టెక్నాలజీ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు