Satires on pictures… | జగన్ పై సెటైర్లు… | Eeroju news

Satires on pictures

జగన్ పై సెటైర్లు…

విజయవాడ, జూన్ 27, (న్యూస్ పల్స్)

Satires on pictures

ఎక్కువ ఎంపి స్థానాలు ఇవ్వండి. కేంద్రం మెడలు వంచి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తాను. ఏపీ రూపురేఖలే మార్చేస్తాను.. 2019 ఎన్నికలకు ముందు వైసీపీ అధినేత జగన్ తరచూ చేసిన ప్రకటన ఇది. ప్రజలు 22 మంది ఎంపీలను ఇచ్చారు. అయినా కేంద్రం మెడలు వంచలేదు. తిరిగి వంగి వంగి దండాలు పెడుతూ వారికే మద్దతు ఇచ్చారు జగన్. పార్లమెంట్ లోని రెండు సభల్లో సైతం.. ఈ సందర్భంలోనైనా బిజెపికి జై కొట్టారు. నిర్ణయాలు, బిల్లులు, జాతీయ అంశాలు.. ఇలా ఒకటేంటి అన్నింటికీ తమ మద్దతును తెలియజేశారు. కానీ గత ఐదు సంవత్సరాలలో కేంద్రానికి తన అవసరం వచ్చినప్పుడు ప్రత్యేక హోదా మెలిక పెట్టలేదు జగన్. ఎన్నికల్లో బిజెపితో పొత్తు పెట్టుకుంది తెలుగుదేశం పార్టీ.

మూడు పార్టీలు కలిసి వెళ్లాయి. ఘనవిజయం సాధించాయి. కానీ గత ఐదేళ్లుగా ప్రత్యేక హోదా తెస్తానని చెప్పిన జగన్ ఎన్నడూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయలేదు. తన అవసరం వచ్చినప్పుడు షరతులు విధించలేదు. కానీ ఇప్పుడు టిడిపి మెజారిటీ ఎంపీ స్థానాలు గెలిచేసరికి.. ప్రత్యేక హోదా తేవాలంటూ సెటైర్లు వేయడం మాత్రం కొంచెం అతిగా ఉంది. తాను చేయలేని పనిని.. మీరైనా చేయండి అని చెబితే బాగుండేది. కానీ తన అసమర్ధతను కప్పిపుచ్చుకొని.. టిడిపి పై ప్రత్యేక హోదా బురద చల్లేందుకు జగన్ వేసిన ఎత్తుగడగా తెలుస్తోంది.కేంద్ర పెద్దలు వైసీపీని ఆశ్రయించారు. తాము నిలబెడుతున్న స్పీకర్ అభ్యర్థికి మద్దతు తెలపాలని కోరారు. పెద్దలు అడిగింది తడవుగా ఓకే చెప్పారు జగన్.

తమ మద్దతు ఎప్పుడూ ఎన్డీఏకు ఉంటుందని ఏకంగా లిఖితపూర్వకంగా కూడా తెలియజేశారు. మరి ఇప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరారా? ఆ షరతుతోనే మద్దతు తెలిపారా? అని టిడిపి సెటైర్లు వేయడం ప్రారంభించింది. ఎన్డీఏ పూర్తి మెజారిటీ ఉంది. 290 మంది ఎంపీలతో మ్యాజిక్ ఫిగర్ కు దాటింది. కానీ అది మిత్రుల మద్దతుతో. అందులో 16 మంది సభ్యులతో టిడిపి కీలకంగా ఉంది. ఒక విధంగా చెప్పాలంటే బిజెపి తర్వాత పెద్ద పార్టీ టిడిపి. కానీ బేషరతుగా వైసీపీ మద్దతు ప్రకటించింది. మొన్నటికి మొన్న ఎన్డీఏలో టిడిపి చేరితే ప్రత్యేక హోదా అడగొచ్చు కదా అని వైసిపి సూచించింది. ఇప్పుడు అదే వైసిపి బిజెపి స్పీకర్ అభ్యర్థికి మద్దతు తెలపడంతో ప్రత్యేక హోదా గురించే కదా.. అంటూ టిడిపి ప్రశ్నిస్తోంది. ఇలా రెండు పక్షాలకు ప్రత్యేక హోదా ప్రధాన ఇష్యూ కావడం గమనార్హం.

 టీడీపీ అలెర్ట్…

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజా ఎన్నికల్లో జగన్ పై ఎన్డీఏ కూటమి విజయం సాధించింది. ఇప్పుడు అదే ఎన్డీఏ కు జగన్ మద్దతు తెలిపారు. ఎన్డీఏ లో కీలక భాగస్వాములుగా చంద్రబాబుతో పాటు పవన్ ఉన్నారు. స్పీకర్ ఎన్నికలకు సంబంధించి ఎన్డీఏకు పూర్తి మెజారిటీ ఉన్నా.. బిజెపి మాత్రం వైసీపీ మద్దతు కోరింది. వెంటనే జగన్ సైతం ఓకే చెప్పారు. అసలు ఏపీ విషయంలో మోదీ వ్యూహం ఏంటన్నది తెలియడం లేదు. మూడు ప్రాంతీయ పార్టీలను తన చెప్పు చేతుల్లోకి తీసుకోవడం ఆసక్తికర పరిణామంగా మారింది. ఏపీలో వైసీపీకి నలుగురు పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. వారు స్పీకర్ ఎన్నికల్లో ఎన్డీఏ నిలిపిన అభ్యర్థికి ఓటు వేయనున్నారు. ఎన్డీఏకు పూర్తి మెజారిటీ ఉంది.

293 మంది సభ్యుల బలం ఉంది. కానీ బిజెపి నాయకత్వం మాత్రం నలుగురు సభ్యులు ఉన్న వైసీపీ మద్దతును కోరింది. 2019 నుంచి ఐదేళ్ల పాటు జగన్ కేంద్రం విషయంలో ఎలా నడుచుకున్నది అందరికీ తెలిసిన విషయమే. కేంద్రానికి అవసరమైన ప్రతిసారి జగన్ మద్దతు తెలుపుతూ వచ్చారు. ఎన్డీఏలో టిడిపి, జనసేన ఉండడంతో స్పీకర్ ఎన్నికల్లో వైసిపి ఎలా వ్యవహరిస్తుంది అన్నది చర్చగా మారింది. కానీ బిజెపి నుంచి మద్దతు కావాలని ప్రతిపాదన రావడం.. దానికి జగన్ ఓకే చెప్పేయడం జరిగిపోయింది. లోక్సభలో వైసిపి పార్లమెంటరీ నేత మిథున్ రెడ్డితో బిజెపి నేతలు చర్చించారు. వెంటనే ఆయన జగన్ తో చర్చలు జరిపారు. ఎన్డీఏకు మద్దతు ఉంటుందని ప్రకటన కూడా వచ్చింది.

ఎన్డీఏకు సంపూర్ణ మెజారిటీ ఉండగా.. వైసీపీ మద్దతు కోరడం ఏమిటన్న ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమవుతోంది. అసలు ఏపీ విషయంలో మోడీ ఏం ఆలోచిస్తున్నారన్న ప్రశ్న వినిపిస్తోంది. ఎన్డీఏలో భాగస్వాములుగా ఉండగా.. బిజెపి వైసిపి మద్దతు కోరడంపై టిడిపి, జనసేనలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మొన్నటికి మొన్న ప్రమాణ స్వీకార మహోత్సవంలో చిరంజీవి, పవన్ ను తీసుకొని వచ్చి మరి ప్రధాని మోదీ అభివాదం చేయించారు. ఇప్పుడు మొన్నటి ఎన్నికల్లో ఎవరిపై పోరాడారో.. అదే జగన్ ను ఇప్పుడు మద్దతు కోరారు. దీని వెనుక వ్యూహం ఏదైనా ఉందా అన్న అనుమానాలు టిడిపిలో ఉన్నాయి. అయితే దీనిపై చంద్రబాబు అలెర్ట్ అయినట్లు తెలుస్తోంది.

ఎన్డీఏ సుస్థిరతను దెబ్బతీయాలని ఆలోచన చేస్తున్న ఇండియా కూటమికి అవకాశం ఇవ్వకూడదని మోడీ భావిస్తున్నారు. అందుకే సభలో తమ బలాన్ని చూపే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే చంద్రబాబుతో పాటు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలను సంప్రదించిన తర్వాతే.. ప్రధాని మోదీ వైసిపి మద్దతు కోరినట్లు తెలుస్తోంది.

 

Satires on pictures

 

Jagan is going to do a yatra to reassure the activists | YS Jagan | కార్యకర్తలకు భరోసా ఇచ్చేందుకు యాత్ర చేయబోతున్న జగన్ | Eeroju news

Related posts

Leave a Comment