Saru… Car… Bazaru.. | సారు…కారు… బేజారు.. | Eeroju news

Saru... Car... Bazaru..

సారు…కారు… బేజారు..

హైదరాబాద్, జూన్ 24, (న్యూస్ పల్స్)

Saru… Car… Bazaru..

అందితే జుట్టు.. లేదంటే కాళ్లు.. ఈ సామెత పర్‌ఫెక్ట్‌గా సూటవుతుంది. మాజీ సీఎం, ప్రస్తుత బీఆర్ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు. ఎందుకీ మాట అనాల్సి వస్తుందంటే ఇప్పుడు ఆయన చేసే చర్యలు అలా ఉన్నాయి కాబట్టి మొన్న మొన్నటి వరకు.. అంటే అధికారం పోయేంత వరకు ఏ రోజైనా పార్టీ నేతలతో భేటీ అయ్యారా? కనీసం ఎమ్మెల్యేలతో అయినా మాట్లాడరా? లేదు. కానీ కాలం మహాచెడ్డది కదా.. ఎన్నికల ముందు వరకు వీనిలాకాశంలో విహరిస్తున్న కేసీఆర్‌ను తమ ఓటుతో నేలకు దించారు ప్రజలు.దీంతో ఇప్పుడు అందరూ కనిపిస్తున్నారు.. అందరితో ముచ్చటించేందుకు ప్రయత్నిస్తున్నారు.. కాని అస్సలు కుదరడం లేదంట. ప్రస్తుతం బీఆర్ఎస్‌లో ఏం నడుస్తోంది? ఇది ప్రశ్న.. ఎప్పుడూ ఖాళీ అవుతుందో అస్సలు సమజ్ అవ్వడం లేదు. ఇదీ సమాధానం.. ఎందుకంటే ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు నేరుగా కేసీఆర్ రంగంలోకి దిగినా పనులు కావడం లేదని ప్రస్తుతం ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌ పరిసరాల్లో వినిపిస్తున్న టాక్. కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి అన్నట్టుగా కాంగ్రెస్‌ వ్యూహాలు కనిపిస్తున్నాయి.

ఏకంగా బీఆర్ఎస్‌ కీలక నేత, మాజీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డికి కండువా కప్పేశారు సీఎం రేవంత్ రెడ్డి.. ఆ వెంటనే ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి జనారెడ్డితో భేటీ అయ్యారు. చూస్తుంటే ఉన్న 38 మంది ఎమ్మెల్యేల్లో ఓ 15 మంది వరకు జంప్‌ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. దీంతో సీన్‌లోకి కేటీఆర్.. ట్రబుల్ షూటర్‌గా పేరున్న హరీష్‌రావు ఎంట్రీ ఇచ్చారు. కానీ పనవ్వడం లేదు.. ఎమ్మెల్యేలను కాపాడుకోలేని పరిస్థితి ఉన్నట్టు కనిపిస్తుంది. దీంతో ఆఖరిగా.. బ్రహ్మాస్త్రంగా కేసీఆరే నేరుగా రంగంలోకి దిగారు. పదేళ్ల తన పాలనలో ఎమ్మెల్యేలతో కేసీఆర్ ఎప్పుడైనా మాట్లాడారా.. ? నలుగురితో నారాయణ అన్నట్టుగా అందరిని సమావేశపరిచి మాట్లాడటమే. అది కూడా వెళ్లపై లెక్కపెట్టే అన్నిసార్లు జరిగాయి ఆ సమావేశాలు. వారు అపాయింట్‌మెంట్‌ కోరినా ఇవ్వలేదన్న ఆరోపణలు ఎన్నో.. కానీ ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కేసీఆరే నేరుగా ఫోన్ చేసినా.. ఎవ్వరూ పట్టించుకోవడం లేదని తెలుస్తుంది. ఎమ్మెల్యే జంపింగ్స్‌తో కేసీఆర్‌లో టెన్షన్‌ మొదలైనట్టు తెలుస్తుంది.

ఫామ్‌హౌస్‌లో హరీష్‌రావు, కేటీఆర్‌తో ప్రత్యేకంగా మీట్‌ అయ్యారు. అసలు ఎమ్మెల్యేలను ఆపడం ఎలా టాపిక్‌పై డిస్కషన్‌ చేశారు. ఎందుకంటే పోచారం లాంటి నేతే కాంగ్రెస్‌ చేరడం అనేది కేసీఆర్‌కు అస్సలు మింగుడు పడని అంశం. దీంతో ఇతర ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటని ఆరా తీశారు. జంప్‌ అయ్యే ఎమ్మెల్యేల లిస్ట్‌ తయారు చేశారు. వారికి నేరుగా కేసీఆర్ ఫోన్ చేసి మాట్లాడినట్టు తెలుస్తుంది. పార్టీ మారవద్దని కష్టకాలంలో పార్టీకి అండగా ఉండాలని హితబోధ చేసినట్టు తెలుస్తుంది. అయితే వారిని ఫామ్‌హౌస్‌కు రమ్మని పిలిచినా.. ఒక్కరు కూడా పట్టించుకోలేదని తెలుస్తుంది.అయితే కేసీఆర్‌కు రెండు రకాల టెన్షన్స్‌ మొదలైనట్టు తెలుస్తుంది. ఓ వైపు కాంగ్రెస్‌.. మరోవైపు బీజేపీ.. అవును.. బీజేపీ కూడా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలపై నజర్ పెట్టింది. రెండు పార్టీలు కూడా ఆపరేషన్‌ ఆకర్ష్‌ మొదలుపెట్టాయి.

ఒకటి రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ.. మరొకటి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ..దీంతో చాలా మంది ఎమ్మెల్యేలు ఏ పార్టీలో చేరాలన్న దానిపై లెక్కలు వేసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే పలువురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు నజర్ పెట్టినట్టు తెలుస్తోంది. అలాంటి నేతలంతా త్వరలో కాషాయ కండువా కప్పుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. కానీ మెజార్టీ ఎమ్మెల్యేల చూపు కాంగ్రెస్‌వైపే ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే జోరుగా మంతనాలు నడుస్తున్నాయి. సీఎం రేవంత్‌ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే ఓ అగ్రనేత ఈ వ్యవహారాలను చక్కదిద్దుతున్నట్టు తెలుస్తోంది.పోచారం కాంగ్రెస్‌లో అధికారికంగా చేరడంతో బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేల సంఖ్య 38కు చేరింది. కనీసం తక్కువలో తక్కువ 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరతారనేది ప్రస్తుతం వినిపిస్తున్న టాక్.. మిగిలిన ఎమ్మెల్యేల చూపు బీజేపీవైపు ఉన్నట్టు కనిపిస్తుంది. మొత్తానికి అప్పుడు సిగలు పట్టుకొని పార్టీ నేతలను ఓ ఆట ఆడించిన కేసీఆర్.. ఇప్పుడు కాళ్లు పట్టుకొని ప్రాధేయపడేంత పని చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని తెలుస్తుంది.

 

Saru... Car... Bazaru..

 

 

ఇంకా సీఎం కేసీఆరే… | And CM KCR… | Eeroju news

 

Related posts

Leave a Comment