Sankranti Special Trains | సంక్రాంతికి మరిన్ని రైళ్లు…. | Eeroju news

సంక్రాంతికి మరిన్ని రైళ్లు....

సంక్రాంతికి మరిన్ని రైళ్లు….

హైదరాబాద్, సెప్టెంబర్ 20, (న్యూస్ పల్స్)

Sankranti Special Trains

సౌత్ సెంట్రల్ రైల్వే ప్లాన్ ఏంటి? సంక్రాంతికి రైళ్లకు కోచ్‌లను పెంచుతుందా? లేకుంటే స్పెషల్‌ రైళ్లను ఏర్పాటు చేస్తుందా? ప్రత్యేకంగా రైళ్లు వేస్తే.. గమ్యస్థానం చేరుకోవడానికి మరింత ఆలస్యమవుతుందా? దీనిపై సౌత్ సెంట్రల్ రైల్వే దృష్టి సారించింది.ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అతి పెద్ద ఫెస్టివల్ సంక్రాంతి. ఎక్కడున్నా ఫెస్టివల్ సమయానికి సొంతూళ్లకు వెళ్తారు. బెంగుళూరు, ముంబై, చెన్నై వంటి నగరాల నుంచి లక్షలాది ఏపీకి వెళ్తుంటారు. ఒక్క తెలంగాణ నుంచి సంక్రాంతికి ఏపీకి దాదాపు 15 లక్షల మంది వెళ్తారన్నది అధికారిక లెక్క. నాలుగు నెలల కిందట రైళ్లకు రిజర్వేషన్లు ఫుల్ అయిపోయాయి.

జనవరి 10 నుంచి 13 వరకు ఏ రైలు రిజర్వేషన్ చూసినా రిగ్రెట్ అని కనిపిస్తోంది. ఇక వెయిటింగ్ లిస్టు మాట్లాడాల్సిన పని లేదు. ఆయా రైళ్లకు ప్రత్యేకంగా కోచ్ వేసినా ఇంకా వెయిటింగ్ లిస్టు అలాగే ఉంటుందని అంటున్నారు.మిగతా నగరాల నుంచి ఏపీకి వెళ్లే రైళ్ల రిజర్వేషన్లు వెయిటింగ్ లిస్టు, రిగ్రెట్ అని చూపిస్తోంది. దీనిపై ప్రయాణికులు కాసింత ఆగ్రహంగా ఉన్నారు. కావల్సినంత రైళ్లను ఏర్పాటు చేయలేదని కొందరు మండిపడుతున్నారు. ఐఆర్‌సీటీసీ సైట్ మరింత చెత్తగా ఉందని అంటున్నారుజరుగుతున్న పరిణామాలను సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు గమనిస్తున్నారు.

సంక్రాంతికి ఇంకా నాలుగు నెలల సమయం ఉందని అంటున్నారు. ఈలోగా వెయిటింగ్ లిస్టు తగ్గవచ్చని అంటున్నారు. ప్రస్తుతమున్న రైళ్లకు అదనంగా కోచ్‌లను యాడ్ చేస్తే సరిపోతుందని అంటున్నారు. కొందరు అధికారులు ప్రత్యేకంగా రైళ్లు వేయాలని, ప్రయాణికులు ముందుగా రిజర్వేషన్లు చేసుకుంటారని అంటున్నారు.వివిధ ప్రాంతాలకు తిరిగే షటిల్ రైళ్ల నుంచి సూపర్‌ఫాస్ట్ వరకు ఏది చూసినా వెయిటింగ్ లిస్టు కనిపిస్తోంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఏపీ మీదుగా ఒడిషా, బెంగాల్ వైపు రైళ్లు వెళ్తుంటాయి.

పండుగ నెల జనవరిలో ఆయా రైళ్లకు డిమాండ్ ఏర్పడింది. వాటికి కోచ్‌లు ఏర్పాటు చేయాలని భావిస్తోందట సౌత్ సెంట్రల్ రైల్వే. వీలు కుదరని పక్షంలో ప్రత్యేకంగా 400 రైళ్లు ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉన్నట్లు కొందరు అధికారులు చెబుతున్నారు. స్పెషల్ ట్రైన్ అంటే కాస్త ఫెయిర్ కూడా ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల సౌత్ సెంట్రల్‌ డివిజన్‌కు ఆదాయం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. స్పెషల్ ట్రైన్లు ఏర్పాటు చేస్తే.. సమాయానికి గమ్యస్థానానికి చేరుకోవడం కష్టమని అంటున్నారు.

యథావిధిగా తిరిగే రైళ్లు సైతం అరగంట నుంచి గంట ఆలస్యం నడుస్తున్నాయని అంటున్నారు. దీనికితోడు వందే భారత్ రైళ్లు అదే రూట్లో నడుస్తున్నాయని గుర్తు చేస్తున్నారు. దీనివల్ల మరింత డిలే అవుతుందని భావిస్తున్నారట అధికారులు. ప్రత్యేక రైళ్లపై కొద్దిరోజుల్లో అధికారులు నిర్ణయం తీసుకునే అవకాశముందని రైల్వే వర్గాలు చెబుతున్నాయి.

సంక్రాంతికి మరిన్ని రైళ్లు....

 

Vande Bharat Train | 19 నుంచి అందుబాటులోకి రానున్న వందే భారత్ ట్రైన్స్ | Eeroju news

Related posts

Leave a Comment