Sangareddy:జాతీయ రహదారి విస్తరణ పనులుIగంటలకొద్ది ట్రాఫిక్ జాములు:సంగారెడ్డి జిల్లా మియాపూర్ నుంచి సంగారెడ్డి వరకు ఉన్న ముంబయి నేషనల్ హైవే 165 నంబర్ రోడ్డును 30 కిలోమీటర్ల మేర ఆరు లైన్ల విస్తరణ పనులు కొనసాగుతున్నాయి.
జాతీయ రహదారి విస్తరణ పనులు
గంటలకొద్ది ట్రాఫిక్ జాములు
సంగారెడ్డి
సంగారెడ్డి జిల్లా మియాపూర్ నుంచి సంగారెడ్డి వరకు ఉన్న ముంబయి నేషనల్ హైవే 165 నంబర్ రోడ్డును 30 కిలోమీటర్ల మేర ఆరు లైన్ల విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో రుద్రారంలో వంద ఫీట్ల నేషనల్ హైవే విస్తరణ కోసం కాంట్రాక్టర్లు లు కనీస నిబంధనలు పాటించకుండా ఇష్టారీతిగా పనులు చేపడుతున్నారు. పాత హైవే రోడ్డును తవ్వడం, ట్రాఫిక్ ను మళ్లించే చర్యలను అధికారులు చేపట్టకపోవడంతో వందలాది వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం సాయంత్రం సంగారెడ్డి నుంచి పటాన్ చెరు వైపు వెళ్లే ప్రధాన రహదారిపై కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవడంతో వాహనదారులు నరకయాతన పడుతున్నారు. గంటల తరబడి వాహనాలు రాత్రి వరకు నిలిచిపోయాయి. కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి హైదరాబాద్ కు వెళ్లాలంటే ఇదే ప్రధాన రహదారి. హైదరాబాద్ లోని ఆస్పత్రులకు వెళ్లాల్సిన ఆంబులెన్స్ లు సైతం చిక్కుకుపోయాయి.
Read more:Hyderabad:తెరపైకి ఫాల్కన్ స్కామ