ఇంద్రకీలాద్రి లో శాకంబరీ దేవి ఉత్సవాలు ప్రారంభం
ఇంద్రకీలాద్రి
Sakambari Devi Utsavam begins in Indrakiladri
ఇంద్రకీలాద్రి పై శ్రీ అమ్మవారి శాకంబరీ దేవి ఉత్సవములు ప్రారంభం అయ్యాయి. శుక్రవారం శాకంబరీ దేవి ఉత్సవములు మొదటి రోజు సందర్భంగా ఆకుకూరలు మరియు కూరగాయలుతో అలంకరించిన దేవస్థానం ప్రాంగణములు, శ్రీ అమ్మవారు, ఉపాలయములలోని దేవతామూర్తులు, మరియు ఉత్సవ మూర్తులు. మూడు రోజుల పాటు దేవస్థానం లో శ్రీ అమ్మవారి శాకంభరీ దేవి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి.
ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు…
అలంకరణ నిమిత్తం పెద్ద మొత్తంలో ఆకుకూరలు, కాయగూరలు భక్తులు విరాళముగా అందజేసారు.
శ్రీ అమ్మవారికి శాకంబరీదేవి గా కూరగాయలు, ఆకుకూరలు మరియు పండ్లతో విశేషముగా అలంకరణ చేసి పూజ వైదిక కార్యక్రమాలు నిర్వహించిన భూలోకములో సకాలములో వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండి ప్రజలు మరియు రైతులు సుఖ-శాంతులు మరియు సంతోషాలతో జీవించుదురని, వైదిక కమిటి తెలిపినట్లు ఆలయ ఈవో కె ఎస్ రామరావు తెలిపారు..