Sajjala | సజ్జల రామక‌ృష్ణారెడ్డి పదవీగండం… | Eeroju news

సజ్జల రామక‌ృష్ణారెడ్డి పదవీగండం...

సజ్జల రామక‌ృష్ణారెడ్డి పదవీగండం…

ఒంగోలు, నవంబర్ 25, (న్యూస్ పల్స్)

Sajjala

సజ్జల రామక‌ృష్ణారెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు. అసలెప్పుడూ చట్ట సభల మెట్లు ఎక్కలేదు. ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం అసలే లేదు. వైసీపీ ప్రధాన కార్యదర్శి అయిన ఆ మాజీ జర్నలిస్టుని తన ప్రభుత్వ సలహాదారుగా నామినేట్ చేసుకున్నారు సీఎం జగన్.. ఇక అప్పటి నుంచి వైసీపీ ప్రభుత్వంలో నెంబరు టూ ఆయనే అన్నట్లు వ్యవహారం నడిచింది. అటు ప్రభుత్వ వ్యవహారాలు, ఇటు పార్టీ వ్యవహారాలు అన్నీ ఆయనే చక్కబెట్టారనిని సొంత పార్టీ వారే అంటుంటారు. పేరుకి ప్రతిశాఖకి మంత్రులు ఉన్నా.. అన్ని విషయాలు ఆయనే డీల్ చేస్తూ.. ఏ సబ్జెక్ట్ అయినా ఆయనే మీడియా ముందుకు వచ్చేవారు. అటు పార్టీ , ఇటు పాలనా వ్యవహారాల్లో ఆయన చెప్పిందే జగన్‌కు వేదమన్నట్లు నడిచింది. అలా షాడో సీఎం అనిపించుకున్న సజ్జల రామకృష్ణారెడ్డి ..

ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధుల ఎంపికలో కూడా చక్రం తిప్పారు. వైసీపీ టికెట్ ఆశించి భంగపడ్డ సిట్టింగు ఎమ్మెల్యేలు, ఇతర ఆశావహులు ఆ విషయాన్ని మీడియా ముందు కొచ్చి చెప్పి మరీ.. సజ్జల పెత్తనంపై ధ్వజమెత్తారంటే ఆయన హవా ఎలా నడిచిందో అర్థం చేసుకోవచ్చు. ఇక వైసీపీ టైంలో జరిగిన వైసీపీ అరాచకాల వెనుక కూడా సజ్జల పాత్ర ఉందన్న ఆరోపణలున్నాయి. జగన్ తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక సజ్జల పాత్ర ఉండేదంటారు. నటి కాదంబరి జత్వానీ కేసులో జగన్ ఆదేశాలతో తెర వెనుక కథంతా నడిపించింది సజ్జలే అన్న ఆరోపణలున్నాయి . ఆ కేసులో ఇప్పటికే ముగ్గురు ఐపీఎస్ లు అడ్డంగా బుక్కైపోయారు. పోలీసులు సాంకేతిక ఆధారాలను సేకరించి మరీ వారి చుట్టూ ఉచ్చు బిగించారు.

త్వానీని అరెస్టు చేసి, ముంబై నుంచీ తీసుకురావడం వరకూ ఐపీఎస్ అధికారులు పీఎస్సార్ ఆంజనేయులు, కాంతిరాణాతాతా, విశాల్ గున్నీలు.. పోలీసుల్లా కాకుండా ప్రొఫెషనల్ కిడ్నాపర్లుగా వ్యవహరించారని తేలింది. విశాల్ గున్నీ ఇచ్చిన వాంగ్మూలంతో.. ఆ కథంతా నడిపించింది సకల శాఖల మంత్రిగా చక్రం తిప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి అన్నది స్పష్టమైందిదాంతో పాటు టీడీపీ సెంట్రల్ ఆఫీసుపై దాడి, చంద్రబాబు నివాసంపై దాడి కేసుల్లో సజ్జల పాత్రపై విచారణ కొనసాగుతుంది. ఆ క్రమంలో ఆయన విదేశాలకు పారిపోకుండా లుక్ అవుట్ నోటీసు జారీ అయింది. కోర్టు రక్షణతో అరెస్ట్ కాకుండా తప్పించుకుంటున్న అలాంటి సజ్జలకు వైసీపీలో ఇంకా ప్రాధాన్యత కొనసాగుతుండటం పార్టీ వర్గాలకు మింగుడుపడటంలేదంట .

వైసీపీ ఇప్పుడు దారుణ‌మైన ప‌రిస్థితిలో ఉంద‌న్నది అంద‌రికీ తెలిసిందే.ఆ పార్టీ నాయ‌కులు ఒప్పుకొన్నా.. ఒప్పుకోకపోయినా.. ప్రస్తుతం వైసీపీ దయనీయస్థితిలో ఉంది. కీలక అధికారంలో ఉన్నంత కాలం చెలరేగిపోయిన నాయకులు ఇప్పుడు అడ్రస్‌ లేకుండా పోతున్నారు. నాయకుల వలసలతో పలు నియోజకవర్గాల్లో వైసీపీ ఇన్చార్జులను నియిమించుకోలేని స్థితిలో ఉంది. క్షేత్రస్థాయిలో ఒక‌ప్పుడు పార్టీ జెండాలు జోరుగా ఎగిరినా.. ఇప్పుడు జెండా మోసేందుకు కూడా ఎవ‌రూ ముందుకు రావ‌డం లేదు. కేసుల భ‌యం ఒక‌టైతే.. పార్టీలో అధినేత తీసుకుంటున్న నిర్ణయాలు కూడా అందుకు కార‌ణంగా క‌నిపిస్తోంది.వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తాడేపల్లి ప్యాలెస్‌లో సజ్జల రామకృష్ణారెడ్డి పెత్తనాన్ని చాలా మంది వ్యతిరేకించారు. అయితే సజ్జలకు జగన్ ఇస్తున్న ప్రయార్టీలో ఎవరూ బహరంగంగా నోరు విప్పే సాహసం చేయలేదు. ఓటమి తర్వాత జగన్ కోటరీనే పార్టీని ముంచిందని పలువురు మాజీ ఎమ్మెల్యేలు విమర్శించారు.

ముఖ్యంగా సజ్జల సొంత పెత్తనం చేస్తుంటార‌ని.. ఎవరి మాట‌ను వినిపించు కునే ర‌కం కూడా కాద‌ని బ‌హిరంగంగానే ధ్వజమెత్తారు. అప్పటి అధికారుల‌ను అడ్డుపెట్టుకుని స‌జ్జల‌ ఇష్టానుసారం చెలరేగిపోయారని అక్కసు వెల్లగక్కారు.అలాంటి సజ్జల రామకృష్ణారెడ్డికి జగన్ ఇప్పుడు వైసీపీ రాష్ట్ర కో ఆర్డినేట‌ర్ ప‌ద‌విని క‌ట్టబెట్టారు. దాన్ని పార్టీలోని రెడ్డి సామాజిక వ‌ర్గమే జీర్ణించుకోలేక‌ పోతుందంట. ఎవ‌రైనా పార్టీపై ఆధార‌ప‌డి ఉంటార‌ని.. పార్టీ నియ‌మాలు నిబంధ‌న‌ల మేరకు న‌డుచుకుంటర‌ని నాయ‌కులు చెబుతున్నారు. కానీ, ఏ మాత్రం రాజకీయ అనుభవం లేని స‌జ్జల మాత్రం తాను చెప్పిన‌ట్టు పార్టీ ఉండాల‌న్న ధోర‌ణిని ప్రదర్శిస్తారని..

క‌ర్నూలు జిల్లాకు చెందిన సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కుడు తాజాగా వ్యాఖ్యానించడం విశేషం. ఆయ‌న ఒక్కర‌నే కాదు.. రెడ్డి సామాజిక వ‌ర్గంలో స‌జ్జల‌పై ఎలాంటి సానుభూతి కూడా లేదంటాు. ఆయ‌న‌పై కేసులు న‌మోదైన‌ప్పుడు కొంద‌రు నాయ‌కులు అంత‌ర్గత సంభాష‌ణ‌ల్లో మంచి ప‌ని జ‌రిగింద‌ని కామెంట్లు చేయ‌డం గ‌మ‌నార్హం. అంటే వారికి ఎలాంటి అభిప్రాయం ఉందో తెలుస్తుంది. ఇప్పుడు సజ్జలకు కు రాష్ట్ర కోఆర్డినేట‌ర్‌ ప‌ద‌వి కట్టబెట్టడంతో జగన్ నిర్ణయంపై నాయకులు మండిపడుతున్నారంట. మళ్లీ సజ్జల పెత్తనాన్ని భరించలేమంటూ పార్టీనాయ‌కులు ఎక్కడిక‌క్కడ కాడి ప‌డేసేందుకు రెడీ అవుతున్నారంట. ఎప్పుడు జైలుకి వెళ్తారో తెలియని సజ్జలకు పార్టీలో అంత కీలక బాధ్యతలు అప్పజెప్పడం ఏంటని? పార్టీలో పెద్ద చర్చే జరుగుతుంది. మొత్తానికి జగన్‌కు సజ్జల రూపంలో పెద్ద స్ట్రోకే తగిలే పరిస్థితి కనిపిస్తుంది.

సజ్జల రామక‌ృష్ణారెడ్డి పదవీగండం...

Sajjala VS Vijay Sai Reddy | సజ్జల వర్సెస్ సాయిరెడ్డి | Eeroju news

Related posts

Leave a Comment