Sagar.. Danger Bells | సాగర్.. డేంజర్ బెల్స్ | Eeroju news

Sagar.. Danger Bells

 సాగర్.. డేంజర్ బెల్స్

హైదరాబాద్, జూలై 16, (న్యూస్ పల్స్)

Sagar.. Danger Bells

తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ లో కూడా నిన్న పలుచోట్లు భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో హుస్సేన్ సాగర్ లో నీటి మట్టం చాలా కాలం తర్వాత గరిష్ఠ స్థాయికి చేరుకుంది. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, శానిటేషన్ సిబ్బందిని హుటాహుటిన రంగంలోకి దించారు. హుస్సేన్ సాగర్ గరిష్ఠ నీటిమట్టం 514.75 మీటర్లు కాగా… ప్రస్తుత నీటిమట్టం 513.41 మీటర్లుగా ఉంది.

మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి పరిస్థితిని సమీక్షించారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల్లో ఉంటున్న వారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. నిన్న రాత్రి హైదరాబాద్ లో 8.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. వరదనీటి కారణంగా పలు ప్రధాన రహదారులపై అక్కడక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. దీని కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు.

ఆదివారం సాయంత్రం కురిసిన భారీ వర్షంతో హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ నీటి మట్టాలు దాదాపు పూర్తి స్థాయికి చేరుకున్నాయి. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, శానిటేషన్ డిపార్ట్‌మెంట్ సిబ్బంది నగరంలోని పలు ప్రాంతాల్లో నీటి నిల్వలను తొలగించేందుకు కృషి చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో  రాత్రి 10 గంటల వరకు సగటున 8.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రహదారులపై భారీగా వరద నీరు చేరింది. ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. కొన్ని చోట్ల కార్లు, ఆటోలతో పాటు ద్విచక్ర వాహనాలు వరదలో కొట్టుకుపోయాయి.

 

Sagar.. Danger Bells

 

 

Slightly increased water level in Bhadradri | భద్రాద్రిలో స్వల్పంగా పెరిగిన నీటిమట్టం | Eeroju news

Related posts

Leave a Comment