Russia Visa | వీసా లేకుండా రష్యా టూర్… | Eeroju news

వీసా లేకుండా రష్యా టూర్...

వీసా లేకుండా రష్యా టూర్…

మాస్కో, అక్టోబరు 30, (న్యూస్ పల్స్)

Russia Visa

భారత్‌ నుంచి ఏటా వందల మంది రష్యాకు వెళ్తుంటారు. మన దేశం నుంచి రష్యాకు వెళ్లడానికి వీసా తప్పనిసరి. వచ్చే ఏడాది నుంచి వీసా లేకున్నా భారతీయులు రష్యా వెళ్లొచ్చు వీసా.. ఏ దేశ పౌరులైనా తమ దేశం నుంచి మరో దేశానికి వెళ్తున్నప్పుడు వీసా తప్పనిసరి. మన దేశం నుంచి ఏటా వేల మంది విదేశాలకు వెళ్తున్నారు. వ్యాపారాల నిమిత్తం కొందరు వెళితే.. ఉపాధి, ఉద్యోగాల కోసం కొందరు. ఉన్నత చదువుల కోసం మరికొందరు.. ఇక సందర్శన కోసం చాలా మంది వెళ్లొస్తున్నారు. అయితే వీరందరికీ వీసా తప్పనిసరగిగా ఉండాలి. అయితే తమ దేశ పర్యాటక ఆదాయాన్ని పెంచుకునేందుకు ఇటీవల కొన్ని దేశాలు వీసా లేకపోయినా అనుమతి ఇస్తున్నాయి.

ఈ జాబితాలో శ్రీలంక, సింగపూర్, థాయ్‌లాండ్, మాల్దీవులు తదితర దేశాలు ఉన్నాయి. కొన్ని దేశాదు మాత్రం కొన్ని దేశాల పౌరులకే అనుమతి ఇస్తున్నాయి. ఇలా భారతీయులకు ఇప్పటి వరకు ప్రపంచంలో 12 దేశాల్లో వీసా లేకుండా వెళ్లే అవకాశం ఉంది. తాజాగా ఈ జాబితాలో రష్యా కూడా చేరబోతోంది. ఆయా దేశాల మధ్య ఉన్న సంబంధాలు, పర్యాటక ఆదాయం పెంపు కోసం ఇలా వీసా లేకపోయినా అనుమతి ఇస్తున్నాయి. తాజాగా బారతీయ పర్యాటకులను ఆకర్షించేందుకు రష్యా కూడా వీసా రహిత పర్యటనలకు అనుమతి ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తోంది.

ఈమేరకు ఒప్పందాలు కీలక దశల్లో ఉన్నట్లు తెలిసింది.వచ్చే ఏడాది నుంచి భారతీయులకు వీసా లేకపోయిరా పర్యటించే అవకాశం కల్పించాలని రష్యా భావిస్తోంది. స్ప్రింగ్‌ జీసన్‌ నుంచి వీసా ఫ్రీ సదుపాయం అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉన్నట్లు రష్యా ఉన్నతాధికారులు ధ్రువీకరించారు. ఈ ఒప్పందానికి సంబంధించి పురోగతి కనిపిస్తోంది. దీంతో రష్యాలో పర్యటించే భారతీయ పర్యాటకులు గణనీయంగా పెరిగే అవకాశం ఉన్నట్లు మాస్కో సిటీ టూరిజం కమిటీ చైర్మన్‌ ఎన్జీనీ కోజ్లోవ్‌ తెలిపారు.

భారత్, రష్యాకు పర్యాటకంగా కీలక మార్కెట్‌. ఈ ఏడాది గడిచిన ఆరునెలల్లోనే 28,500 మంది భారతీయులు మాస్కోలో పర్యటించారు. గతేడాది ఇదే సమయంలో రష్యాలో పర్యటించిన భారతీయులతో పోలిస్తే ఈ ఏడాది పర్యాటకుల సంఖ్య ఒకటిన్నర రెట్లు పెరిగింది. వాణిజ్యం, వ్యాపార సంబంధిత కారణాలతో రష్యాలో పర్యటించడం ఎక్కువగ. ముఖ్యంగా సుదీర్ఘ సంబంధాల దృష్ట్యా భారత్‌ను కీలక మార్కెట్‌గా మాస్కో భావిస్తోంది.గతేడాది నుంచి రష్యా భారతీయులకు వీసా జారీ మరింత సరళతరం చేసింది.

భారతీయులు దరఖాస్తు చేసుకున్న నాలుగు రోజుల్లనే వీసా జారీ చేస్తోంది. సంఖ్యాపరంగా గతేడాది అత్యధిక వీసాలు పొందిన తొలి ఐదు దేశాల్ల భారత్‌ కూడా ఉంది. మొత్తంగా గతేడాది 9,600 భారతీయ పర్యాలకులకు వీసాలు జారీ అయ్యాయి. రష్యాకు వచ్చే విదేశీ పార్యటకుల్లో ఇది ఆరుశాతం.ఇక భారత్, రష్యా దేశాల మధ్య ఏడాది పొడవునా సమావేశాలు, పండుగలు, ప్రదర్శనలు, సదస్సులు జరుగుతూనేఉంటాయి. వాణిజ్య టూరిజంకు మాస్కో కేంద్రంగా మారుతోంది. వీటికితోడు భారతీయ వివాహాది శుభకార్యాలకు రష్యాలోని పలుప్రాంతాలను ఎంపిక చేసుకునేందుకు వీలుగా ఆకర్షించాలని యోచిస్తున్నట్లు రష్యా అధికారులు తెలిపారు. అతిథుల కోసం హోటల్ గదుల సంఖ్య 25 వేలకు పెంచే ప్రయత్నాలు చేస్తోంది.

వీసా లేకుండా రష్యా టూర్...

 

Pablo Escobar in Google Search | గూగుల్ సెర్చ్ లో పాబ్లో ఎస్కో బార్ | Eeroju news

Related posts

Leave a Comment