Runamafi | సంపూర్ణ రుణమాఫి చేయాలి | Eeroju news

సంపూర్ణ రుణమాఫి చేయాలి

సంపూర్ణ రుణమాఫి చేయాలి

హైదరాబాద్

Runamafi

తెలంగాణ భవన్ అలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పని తీరు ఎలా ఉందంటే ఎన్నికలపుడు గాల్లో మాటలు ,అధికారం లో గాలి మోటార్ల యాత్రలు అన్నట్టు ఉంది. శ్రీశైలం నిర్వాసితుల సమస్యను ఈ ప్రభుత్వం పరిష్కరించడం లేదు. తత ప్రభుత్వాలు శ్రీశైలం నిర్వాసితులకు అన్యాయం చేశాయని ఎన్నికలప్పుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. శ్రీశైలం నిర్వాసితుల్లో 78 మంది కి కేసీఆర్ ప్రభుత్వం లష్కర్లుగా శాశ్వత ఉద్యోగాలు ఇచ్చింది. కేసీఆర్ హాయం లో ఆరువేల లష్కర్ ఉద్యోగాలు నింపాలనుకుని అందులో శ్రీశైలం నిర్వాసితులకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రతిపాదించారు. ఇందుకోసం జీవో కూడా ఇచ్చారు. వంత్ ఎన్నికలప్పుడు హామీ ఇచ్చినా అది నెరవేరడం లేదని అన్నారు.

పాలమూరు జిల్లాకు మంత్రులు గాలి మోటర్లలో వచ్చి గాలి మాటలు చెప్పి వెళ్లారు. వెంటనే శ్రీశైలం నిర్వాసితుల సమస్యను పరిష్కరించాలి. ఈ ప్రభుత్వానికి హానీమూన్ పీరియడ్ అయిపోయింది. ప్రభుత్వ ఆస్పత్రులు అద్వాన్నంగా మారాయి. కాంగ్రెస్ ప్రభుత్వం పై ప్రజలు తిరగబడే రోజులు వచ్చాయని అన్నారు.
మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ మాట్లాడుతూ నల్లగొండ జిల్లా మంత్రులు తమ సొంత పనులకే ప్రాధాన్యత ఇస్తున్నారు. హైదరాబాద్ నుంచి నల్లగొండ తిరుగుతున్నారు తప్ప ఏ సమస్యలు పట్టించుకొవడం లేదు. మిషన్ భగీరథ పై మంత్రి కోమటి రెడ్డి పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారు.

షన్ భగీరథ తో నల్లగొండ జిల్లా లో ఫ్లోరోసిస్ దూరమైందని పార్లమెంట్ లో కేంద్రం సమాధానం ఇచ్చింది. అపుడు కోమటి రెడ్డి ఎంపీ గా ఉన్నారు. ఫోరోసిస్ భూతం ఉందని కల్లిబొల్లి మాటలు చెబుతున్నారు. .కేసీఆర్ యే ఫ్లోరోసిస్ భూతాన్ని తరిమి కొట్టారు. నెల్లికల్ లిఫ్ట్ పై ప్రజలకు కోమటి రెడ్డి స్పష్టత ఇవ్వాలి. జానా రెడ్డి 6 వేల ఎకరాలకు నీళ్లు ఇస్తాం అంటున్నారు. 24 వేల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని కేసీఆర్ ప్రతిపాదించారు .దాన్ని అమలు చేయాలి. అమృత్ స్కాం పై కే టీ ఆర్ పూర్తి ఆధారాలతోనే మాట్లాడారు. రేవంత్ రెడ్డి దగ్గర కాంట్రాక్టులు ద్సక్కించుకునేందుకే కోమటి రెడ్డి కే టీ ఆర్ పై అనవసర విమర్శలు చేస్తున్నారు.

బీ ఆర్ ఎస్ నుంచి మరికొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని కోమటి రెడ్డి అంటున్నారు. రేవంత్ రెడ్డి చేస్తున్న పాడు పనులు చూసి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారా ? .ఇంకా నాలుగేళ్ళు రేవంత్ పాలనను ఎలా భరించాలి అని ప్రజలు అనుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో ఎందుకు చేరుతారు ?
వానా కాలం సీజన్ కు ఇంకా ఐదు రోజులే టైం ఉంది .. రైతు బంధు ఎప్పుడిస్తారు ? కాళేశ్వరం ప్రాజెక్టు లో జైల్లో వేయాల్సి వస్తే ఇంజినీర్లు మిగలరని రేవంత్ అనడం ప్రభుత్వ ఉద్యోగులను అవమానపరచడమేనని అన్నారు.
కాళేశ్వరం పై కాంగ్రెస్ నేతలు అబద్దాలు మాట్లాడుతున్నారు. మూసి కి మల్లన్న సాగర్ నీళ్లు తెస్తామని సీఎం అంటున్నారు . కాళేశ్వరం లేక పోతే మల్లన్న సాగర్ ఎక్కడిది. .కాళేశ్వరం పై నిజాలతో కూడిన బుక్ లెట్ ను కాంగ్రెస్ నేతలకు పోస్టు లో పంపిస్తామని అన్నారు.

మాజీ ఎమ్మెల్యే జాజల సురేందర్ మాట్లాడుతూ గ్యారంటీల పై గాలి మాటలు చెప్పి కాంగ్రెస్ నేతలు తప్పించుకుంటున్నారు. కేసీఆర్ పై విమర్శలు తప్ప రేవంత్ రెడ్డి సాధించిందేమీ లేదు. గ్రామాల్లో కాంగ్రెస్ హామీల పై ప్రజలు నిలదీస్తున్నారు. ముందు వాటిపై రేవంత్ దృష్టి పెట్టాలి. .గ్రామాల్లో పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలి. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల బిల్లులు కూడా ఇవ్వడం లేదు. పారిశుద్యం పడకేసింది. రైతు రుణ మాఫీ కాక అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. సంపూర్ణ రుణ మాఫీ అమలు చేయాలని అన్నారు.

సంపూర్ణ రుణమాఫి చేయాలి

 

BRS concern for loan waiver | రుణమాఫికోసం బీఆర్ఎస్ అందోళన | Eeroju news

Related posts

Leave a Comment