Rocking star Yash’s Pan India blockbuster | బెంగ‌ళూరులో పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైన రాకింగ్ స్టార్ య‌శ్‌ భారీ పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’ | Eeroju news

Rocking star Yash's Pan India blockbuster

బెంగ‌ళూరులో పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైన రాకింగ్ స్టార్ య‌శ్‌ భారీ పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్: ఎ

ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’

 

Rocking star Yash’s Pan India blockbuster

 

బాక్సాఫీస్ సెన్సేష‌న్ రాకింగ్ స్టార్ య‌శ్ హీరోగా బెంగ‌ళూరులో భారీ పాన్ ఇండియా మూవీ  ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’ గురువారం రోజున పూజా కార్య‌క్ర‌మాల‌తో లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. అనౌన్స్‌మెంట్ రోజు నుంచి సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ ఎక్స్‌పెక్టేష‌న్స్‌ను మించేలా డైరెక్ట‌ర్ గీతూ మోహ‌న్‌దాస్ తెర‌కెక్కించ‌నున్నారు. గురువారం జ‌రిగిన పూజా కార్య‌క్ర‌మాల్లో సంప్రదాయానికి అనుగుణంగా నటుడు, నిర్మాత యశ్, నిర్మాత వెంకట్ కె.నారాయణ, వారి కుటుంబ సభ్యులతో కలిసి సినిమా విజయం సాధించాలని దేవుడి ఆశీస్సులు కోరారు.

పూజా కార్య‌క్ర‌మాల్లో చిత్ర యూనిట్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరై టీమ్‌కి అభినందన‌లు తెలిపారు. కెజియ‌ఫ్ త‌ర్వాత య‌శ్‌ ఎలాంటి సినిమా చేస్తారోన‌ని ఆస‌క్తిగా ఎదురు చూసిన అభిమానుల నిరీక్ష‌ణ‌కు ఈరోజుతో తెర‌ప‌డింది. అలాగే సినిమా ప్రారంభ‌మైన రోజుని న్యూమ‌రాల‌జీ ప్ర‌కారం చూసిన 8-8-8ను సూచిస్తుంది. ఇది య‌శ్ పుట్టిన‌రోజును తెలియ‌జేస్తుంది. గీతు మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్న‌ “టాక్సిక్ష‌ను విజువ‌ల్ గ్రాండియ‌ర్ మూవీగా, ఎమోష‌న‌ల్‌, ప‌వ‌ర్‌ఫుల్ క‌థ‌తో తెర‌కెక్కించ‌నున్నారు. దీని కోసం స్టార్ యాక్ట‌ర్స్‌, టెక్నిక‌ల్ టీమ్ చేతులు క‌లిపింది.

Rocking star Yash's Pan India blockbuster

 

Peka Medalu movie grand trailer launch event was held today movie release on 19th July | పేక మేడలు మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నేడు ఘనంగా జరిగింది – జూలై 19న సినిమా విడుదల | Eeroju news

Related posts

Leave a Comment