సరసమైన ధరలకు బియ్యం, కందిపప్పు
విజయవాడ, జూలై 22 (న్యూస్ పల్స్)
Rice and pulses at affordable prices
రాష్ట్ర వ్యాప్తంగా రైతు బజార్లు, రిటైల్ మార్కెట్లలో సరసమైన ధరలకు నాణ్యమైన బియ్యం, కందిపప్పును ప్రత్యేక కౌంటర్లలో విక్రయిస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ తెలిపింది. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటుచేశామని అధికారులు తెలిపారు.రాష్ట్ర వ్యాప్తంగా రైతు బజార్లు, రిటైల్ మార్కెట్లలో సరసమైన ధరలకు నాణ్యమైన బియ్యం, కందిపప్పును ప్రత్యేక కౌంటర్లలో విక్రయిస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ తెలిపింది. పౌరసరఫరాల శాఖ ఆదేశాలతో ఎన్టీఆర్ జిల్లాలోని అన్ని రైతు బజార్లలో, ఉషోదయ, మెట్రో, రిలయన్స్, డిమార్ట్ రిటైల్ దుకాణాలలో సరసమైన ధరలలో నాణ్యమైన బియ్యం, కందిపప్పును ప్రత్యేక కౌంటర్ల ద్వారా విక్రయిస్తున్నట్లు జేసీ సంపత్ కుమార్ చెప్పారు.
ఇప్పటి వరకు 7 రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా, 27 రిటైల్ షాపులలో, 96 బియ్యం షాపులలో, 49 పప్పుధాన్యాల షాపులలో నాణ్యమైన బియ్యం, కందిపప్పు విక్రయిస్తున్నట్లు జేసీ తెలిపారు. బహిరంగ మార్కెట్ లో రు.181 ధర ఉన్న కందిపప్పును రు.160లకు, అదేవిధంగా కర్నూలు సోనా మసూరి స్టీమ్ రైస్ బహిరంగ మార్కెట్ లో రూ.55.85 ఉండగా కిలో రు.49లకు, కర్నూలు సోనా మసూరి పచ్చి బియ్యం రు.52.40 నుంచి రూ.48 లకు తగ్గించి అమ్మటానికి చర్యలు తీసుకున్నామన్నారు.
ఇప్పటి వరకు పలు దుకాణాల్లో 5335 వినియోగదారులు 227.74 క్వింటాళ్ల బియ్యం, 6923 వినియోగదారులు 83.02 క్వింటాళ్ల కందిపప్పు ప్రత్యేక కౌటర్లలో కొనుగోలు చేసినట్లు అధికారులు తెలిపారు.అన్ని అమ్మకపు కౌంటర్ల వద్ద సరుకుల నాణ్యతను టెక్నికల్ సిబ్బంది, తూకాన్ని లీగల్ మెట్రాలజీ సిబ్బంది తనిఖీ చేస్తుందన్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని అన్ని ప్రత్యేక అమ్మకం కౌంటర్ల ద్వారా ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవలసినదిగా జాయింట్ కలెక్టర్ డా. పి. సంపత్ కుమార్ తెలిపారు.
Trek from Amaravati to Tirumala | అమరావతి నుoచి తిరుమల వరకు పాదయాత్ర | Eeroju news