Review meeting with Court Duty Officers and Court Licensing Officers | కోర్ట్ డ్యూటీ ఆఫీసర్స్ మరియు కోర్టు లైసెన్ ఆఫీసర్స్ తో సమీక్షా సమావేశం | Eeroju news

కోర్ట్ డ్యూటీ ఆఫీసర్స్  మరియు కోర్టు లైసెన్ ఆఫీసర్స్  తో సమీక్షా సమావేశం

కోర్ట్ డ్యూటీ ఆఫీసర్స్  మరియు కోర్టు లైసెన్ ఆఫీసర్స్  తో సమీక్షా సమావేశం

రామగుండం

Review meeting with Court Duty Officers and Court Licensing Officers

Review meeting with Court Duty Officers and Court Licensing Officersకోర్టు డ్యూటీ ఆఫీసర్ లు నేరస్థులు శిక్షల నుండి తప్పించుకోకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించి నేరస్తులకు శిక్షలు పడుటకు కృషి చేయాలని రామగుండము పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ ఐజి, అన్నారు. రామగుండము పోలీస్ కమీషనరేట్ పరిదిలోని పెద్దపల్లి, మంచిర్యాల జోన్ పరిదిలోని పోలీస్ స్టేషన్ లలో పనిచేస్తున్న కోర్ట్ డ్యూటీ ఆఫీసర్స్ మరియు కోర్టు లైసెన్ ఆఫీసర్స్ తో  కమీషనరేట్ లో సిపి సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ. కోర్టు కానిస్టేబుల్ కోర్టు కేలండర్ తయారు చేసుకోవాలని, నిందితులకు శిక్షలు పడేటట్లు సాక్షులను మోటివేషన్ చేయాలన్నారు. ప్రతీ కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండాలని, షెడ్యూల్ ప్రకారం సాక్షులను కోర్టులో హాజరుపర్చాలని సూచించారు.

పెండింగ్, పెట్టి కేసులు వెంటనే డిస్పోజల్ చేయాలని, నేరస్తులకు శిక్షలు పడితే నేరాలు తగ్గుముఖం పడతాయన్నారు.  కోర్ట్, వారెంట్స్ , సమన్స్,  వర్టికల్స్ గురించి పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న కోర్ట్ కానిస్టేబుల్ అధికారులు తమ విధిలో భాగంగా ఎప్పటికప్పుడు ఎన్.బి.డబ్లూ. నాన్ బేలబుల్ వారెంటులను,  క్రమం తప్పకుండా అమలు పరిచి నేరస్తులకు శిక్షలు పడేవిధంగా కృషిచేయాలని, కన్విక్షన్ రేటును పెంచాలని అన్నారు. కోర్టు కానిస్టేబుల్ బాధ్యత చాలా కీలకమైనదని, నేర రహిత సమాజముగా తీర్చిదిద్దాలంటే నిందితులకు కోర్టులో శిక్షపడే విధంగా కోర్టు డ్యూటీ పోలీసు సిబ్బంది శ్రమించాలని, ఇందుకోసం ఎఫ్ఐఆర్ నమోదు అయినప్పటి నుండి కేసు పూర్తయ్యేంతవరకు నిందితుల నేరాలను నిరూపించేందుకు అవసరమైన రుజువులు, పత్రాలు, సాక్షుల వాగ్మూలంను కోర్టుకు సమర్పించడంలో కోర్టు కానిస్టేబుల్ ప్రత్యేక శ్రద్ద, బాధ్యత తీసుకోవాలని సూచించారు.

కోర్టు నందు ఎఫ్ఐఆర్ లను సరైన సమయంలో అందించాలని కేసుల్లో ఉన్నటువంటి ప్రాపర్టీని సరైన సమయంలో కోర్టు నందు డిపాజిట్ చేయాలి. కోర్టులో బాధితులకు న్యాయం జరిగే విధంగా నేరస్తులకు శిక్ష పడే విధంగా కృషిచేయాలని, నేరస్తులకు వారంట్స్, సమన్స్, సత్వరమే ఎగ్జిక్యూటివ్ అయ్యే విధముగా చర్యలు తీసుకోవాలని, కోర్టు ప్రాసిక్యూషన్ కు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్ కు తెలియజేయాలని, కోర్ట్ క్యాలెండర్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని మరియు కేసు ట్రయల్స్ సమయములో పబ్లిక్ ప్రాసిక్యూటర్ యొక్క సలహాలు సూచనలు పాటించాలని, కోర్టు పెండింగ్ ట్రయల్ కేసులు, వారెంట్స్, సమన్స్, సి.సి.టి.యన్.యస్ లో  కోర్ట్ మానిటరింగ్ సిస్టమ్, లో డాటా ఎంటర్ చేయాలని సూచించారు. కోర్టు నందు ట్రయల్ జరిగిన కేసులు ఎంటర్ చేసినచో పెండింగ్ లేకుండా వుంటుందని తెలిపారు. భాదితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని, భాదితులకు మరింత నమ్మకం పెరిగేలా ప్రతి ఒక్క అధికారి పనిచేయాలని సూచించారు.

అదనపు డిసిపి అడ్మిన్ సి.రాజు, గోదావరి ఖని ఏసీపీ రమేష్, పెద్దపల్లి ఏసిపి జి కృష్ణ, జైపూర్ ఏసిపి వెంకటేశ్వర్లు బెల్లంపల్లి ఏసిపి రవి కుమార్,స్ఎపెషల్ఆ బ్ర్రాంచ్ ఎసిపి రాఘవేంద్ర రావు , ఎసిపి ప్రతాప్,సిసి ఆర్ బి ఇన్స్పెక్టర్ బుద్దే స్వామి ,పెద్దపల్లి,మంచిర్యాల జోన్ ల కోర్ట్ డ్యూటీ ఆఫీసర్స్ పాల్గొన్నారు.

కోర్ట్ డ్యూటీ ఆఫీసర్స్  మరియు కోర్టు లైసెన్ ఆఫీసర్స్  తో సమీక్షా సమావేశం

 

 

What is Jagan’s strategy behind petitions in courts? | కోర్టుల్లో పిటిషన్ల వెనుక జగన్ వ్యూహం ఏమిటి ? | Eeroju news

Related posts

Leave a Comment