భారీ పెట్టుబడులే లక్ష్యంగా రేవంత్ టూర్
హైదరాబాద్, ఆగస్టు 3 (న్యూస్ పల్స్)
Revanth Tour aims for huge investments
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. 10 రోజుల పర్యటనలో భాగంగా అమెరికాతో పాటు, దక్షిణ కొరియాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగానే శనివారం ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ముఖ్యమంత్రితో పాటు, మంత్రి శ్రీధర్ భాబు.. అధికారలు బృందం అమెరికాకు బయలు దేరి వెళ్లారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడే లక్ష్యంగా సీఎం విదేశీ పర్యటన ఉంటుందని ఇది వరకే అధికారులు ప్రకటించారు. మొదట హైదరాబాద్ నుంచి న్యూయార్క్ చేరుకుంటారు. అక్కడ ఆరోజు రోజుల అనంతరం అక్కడి నుంచి నేరుగా దక్షిణ కొరియా వెళ్తారు.
అనంతరం అక్కడ పర్యటన ముగించుకొని తిరిగి సీఎం బృందం ఈ నెల 14వ తేదీన ఉదయం హైదరాబాద్‌కు తిరిగి చేరుకుంటారు.ఈ పది రోజుల పర్యాటనలో భాగంగా సీఎం బృందం పారిశ్రామిక దిగ్గజాలతో 52 సమావేశాల్లో పాల్గొననున్నారు. ఇందులో భాగంగా రూ. 50 వేల కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా చర్చలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ఐటీ, ఫార్మా, ఇతర పరిశ్రమల రంగంలో పెట్టుబడులు పెట్టాలని అంతర్జాతీయ కంపెనీలతో చర్చలు జరపనున్నారు. వీరిలో ప్రముఖంగా అమెజాన్ వైస్ ప్రెసిడెంట్, కాగ్నిజెంట్ సీఈవో, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ సీవోవో, పెప్సీ కో సీనియర్ మేనేజ్మెంట్, అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన వారు ఉన్నారు.
ఇక ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడితోనూ సీఎం భేటీ కానున్నారు. ఈ నెల6వ తేదీ వాషింగ్టన్‌లోని ప్రపంచ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో ఈ మీటింగ్ ఉండనుంది. మూసీ ప్రాజెక్టుతోపాటు రాష్ట్రంలో చేపడుతున్న ఇతర ప్రాజెక్టుల గురించి ఆయనకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సీఎం బృందం వివరించనుంది. ఈ ప్రాజెక్టుల్లో ప్రపంచ బ్యాంకు భాగస్వామ్యం కావాలని, ఆర్థిక సాయం చేయాలని కోరే అకవాశాలు ఉన్నాయి.ఇక స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ కూడా సీఎం సందర్శించనున్నారు. రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ భాగస్వామ్యంపైనా అక్కడి డీన్‌తో మాట్లాడనున్నారు. అనంతరం శాన్ఫ్రాన్సిస్కోలోని గోల్డెన్ గేట్ బ్రిడ్జిని సందర్శించనున్నారు. మూసీ ప్రాజెక్టుకు సంబంధించి చేపట్టబోయే అంశాలను అక్కడ పరిశీలించనున్నారు. ఇక దక్షిణ కొరియా పర్యటనలో టెక్స్టైల్ దిగ్గజ కంపెనీలతో సీఎం సమావేశం కానున్నారు.
Target Revanth… | టార్గెట్ రేవంత్… మారుతున్న సమీకరణాలు | Eeroju news