Regent International | ప్రపంచంలోనే అతిపెద్ద అపార్ట్‌మెంట్‌.. 20 వేల మంది నివాసం.. | Eeroju news

ప్రపంచంలోనే అతిపెద్ద అపార్ట్‌మెంట్‌.. 20 వేల మంది నివాసం..

ప్రపంచంలోనే అతిపెద్ద అపార్ట్‌మెంట్‌.. 20 వేల మంది నివాసం..

న్యూ డిల్లీ అక్టోబర్ 7

Regent International

ప్రపంచంలోనే అతిపెద్ద అపార్ట్‌మెంట్‌ ను ఎప్పుడైనా చూశారా..? పోనీ ఎక్కడ ఉందో తెలుసా..? రీజెంట్‌ ఇంటర్నేషనల్‌’ ప్రపంచంలోనే అతిపెద్ద అపార్ట్‌మెంట్‌. ఇది చైనాలోని కియాన్‌జియాంగ్‌ సెంచురీ నగరంలో ఉంది. ఈ అపార్ట్‌మెంట్‌లో ఏకంగా 20 వేల మందికి పైగా నివాసితులు ఉన్నారు.675 అడుగుల ఎత్తైన ఈ బహుళ అంతస్తుల భవనం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనదిగా నిలుస్తోంది. మొత్తం 39 అంతస్తుల్లో ఈ భవంతిని ఎంతో అద్భుతంగా నిర్మించారు.

14 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ‘ఎస్‌’ ఆకారంలో నిర్మించారు. ఇందులో గరిష్ఠంగా 30 వేల మంది నివసించొచ్చు. ఇక ఈ భారీ నిర్మాణం అనేక సౌకర్యాలు, వ‌స‌తుల‌ను క‌లిగి ఉండ‌డం మ‌రో విశేషం.ఇందులో షాపింగ్‌ మాల్స్‌, రెస్టారెంట్లు, స్కూళ్లు, హాస్పిటల్స్‌, స్విమ్మింగ్‌ పూల్స్‌, నిత్యవసర దుకాణాలు, సెలూన్లు, పార్కులు.. ఇలా సకల సౌకర్యాలు ఇందులో ఉన్నాయి.

నివాసితులు బిల్డింగ్‌ కాంపౌండ్‌ కూడా దాటి బయటకు వెళ్లాల్సిన అవసరం లేకుండా అన్నీ అందులోనే లభిస్తాయట. ప్రస్తుతం ఈ భవంతిలో 20 వేల మంది నివాసం ఉంటున్నారు. మరో 10 వేల మందికి సరిపడా ఏర్పాట్లు కూడా ఉన్నాయి. ఇక ఇందులో విస్తీర్ణాన్ని బట్టి రూ.18 వేల నుంచి రూ.50 వేల వరకూ రెంట్‌ ఉంటుందట. ఈ ఆకాశహర్మ్యం 2013లో ప్రారంభ‌మైన‌ప్పటికీ.. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ప్రపంచంలోనే అతిపెద్ద అపార్ట్‌మెంట్‌.. 20 వేల మంది నివాసం..

Telangana | డిజిటల్ సర్వేను పరిశీలించిన కలెక్టర్ | Eeroju news

Related posts

Leave a Comment