Rat in chutney Minister Damodara’s anger | చట్నీలో ఎలుక మంత్రి దామోదర ఆగ్రహం | Eeroju news

Damodara Rajanarsimha

చట్నీలో ఎలుక
మంత్రి దామోదర ఆగ్రహం

హైదరాబాద్

Rat in chutney Minister Damodara’s anger

సంగారెడ్డి  జిల్లాలోని చౌటకూరు మండలం సుల్తాన్పూర్లోని జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల హాస్టల్లో  చట్నీలో ఎలుక కనిపించిన ఘటన కలకలం రేపింది దీనిపై తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖమంత్రి దామోదర రాజనర్సింహ స్పందించి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి మాట్లాడుతూ తక్షణమే విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సంగారెడ్డి అదనపు కలెక్టర్, ఆర్డీవో, జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులను ఆదేశించారు.  ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో ఉన్న హాస్టళ్లు, క్యాంటీన్లను తనిఖీ చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆహార పదార్థాలను తయారు చేసే నిర్వాహకులు, లైసెన్స్ తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో నాణ్యమైన ఆహారం అందించేందుకు ఫుడ్ సేఫ్టీ అధికారులు నిరంతరం హోటళ్లు, రెస్టారంట్లతో పాటు బేకరీలు, హాస్టళ్లు, క్యాంటీన్లు, ఆహార పదార్థాలు తయారు చేసే నిర్వాహకులపై నిఘా ఉంచాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాల మేరకు సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ మాధురి జేఎన్టీయూ క్యాంపస్లోని వంట గదిని పరిశీలించారు. వంటగతి అపరిశుభ్రంగా ఉండటంతో ప్రిన్సిపల్, కాంట్రాక్టర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ ఇంట్లో ఇలాగే ఉంటుందా.? అని సిబ్బందిని నిలదీశారు. వెంటనే మెస్ కాంట్రాక్టర్ను మార్చాలని ఆదేశించారు. వందలాది మంది విద్యార్థులు తినే ఆహారం ఇలా అపరిశుభ్రంగా ఉండటం ఏంటని ప్రశ్నించారు. అంతకు ముందు విద్యార్థులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. రోజూ తినే ఆహారంలో బొద్దింకలు, బల్లులు, ఎలుకలు కనిపిస్తూనే ఉన్నాయని విద్యార్థులు వాపోయారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం తో పాటు పరిశుభ్రమైన వాతావరణంలో ఆహారాన్ని వడ్డించాలని సిబ్బందికి సూచించారు.

Damodara Rajanarsimha

 

Police raids on pawn shops and fast food centers | పాన్ షాపులు,ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో పోలీసుల ఆకస్మిక తనిఖీలు | Eeroju news

Related posts

Leave a Comment