మంగళవారం నాడు బీజేపీ కార్యాలయం పై యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేయడంపై బుధవారం బీజేవైఎం నిరసన వ్యక్తం చేసింది. మీర్ పేట్ చౌరస్తా లో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేయడానికి ప్రయత్నిస్తున్న సమయం లో పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.
మీర్ పేట్ లో బీజేవైఎం నిరసన
సిఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్దానికి యత్నం
రంగా రెడ్డి
మంగళవారం నాడు బీజేపీ కార్యాలయం పై యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేయడంపై బుధవారం బీజేవైఎం నిరసన వ్యక్తం చేసింది. మీర్ పేట్ చౌరస్తా లో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేయడానికి ప్రయత్నిస్తున్న సమయం లో పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.
దీంతో బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు రోడ్డు పై బైఠాయించే నిరసన వ్యక్తం చేశారు. బీజేవైఎం రంగా రెడ్డి జిల్లా వైస్ ప్రెసిడెంట్ చింతల రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి పాలన మొత్తం విధ్వంసకరంగా సాగుతుందని మండిపడ్డారు. కార్యకర్తల పై,పార్టీ ఆఫీస్ పై దాడి చేసిన గుండాలను వెంటనే అరెస్ట్ చేయాలని చింతల రాఘవేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. బీజెపి కార్యకర్తల సహనాన్ని పరీక్షించవద్దని తిరిగి దాడి చేస్తే కాంగ్రెస్ నాయకులు ఒకరు కూడా బయట తిరుగలేరని హెచ్చరించారు. ప్రజలకు ఇచ్చిన హామీల పై పాలన పై దృష్టి సారించాలని సూచించారు. అందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేసి మీర్ పేట్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
Read:Nalgonda:నల్గోండ జిల్లాలో సోలార్ పవర్ ప్లాంట్ కోసం 270 ఏకరాలు గుర్తింపు