Ramachepa | రామచేప రేటే వేరప్పా…. | Eeroju news

రామచేప రేటే వేరప్పా....

రామచేప రేటే వేరప్పా….

కాకినాడ, నవంబర్ 4, (న్యూస్ పల్స్)

Ramachepa

Ramachepaపులస చేప తెలుగు రాష్ట్రాల్లో ఎంత ఫేమసో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గోదావరికి వరదనీరు వచ్చినప్పుడు జాలర్లకు చిక్కే ఈ చేపలు.. వారి దండిగా కాసులను అందిస్తాయి. జులై నుంచి అక్టోబర్‌ వరకు పులసలు చిక్కుతూ ఉంటాయి. రుచితో పాటు ఎన్నో పోషక విలువలు ఈ చేప సొంతం. పల్లెటూర్లలో ఎవరైనా పులస.. కొని వండుకున్నారంటే.. ఊరంతా ఆ విషయాన్ని ఆ రోజు గొప్పగా చెబుతుంటారు. అది పులస రేంజ్. ఇక పులస మాదిరిగానే.. గోదావరి జిల్లాల్లో ‘రామ చేప’ కూడా చాలా పాపులర్. వీటికి కూడా మంచి డిమాండ్ ఉంటుంది.

రామ చేపలు చూడటానికి బొమ్మిడాయిలు మాదిరిగానే ఉంటాయి. టేస్ట్ అయితే పులసల లాగానే ఉంటుందట. ఈ చేపలు 5 నుంచి 7 అంగుళాలు ఉంటాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉప్పుటేరు పరివాహక ప్రాంతాల్లో అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఈ చేపల లభ్యత ఉంటుందిరామల చేపలు.. కిలోకు 40 వరకు తూగుతాయి. కానీ వీటిని పీస్‌ల లెక్క అమ్ముతూ ఉంటారు. సాధారణంగా రామలు ధర ఒక్కోటి రూ.25 వరకు ఉంటుంది. కానీ ప్రారంభ సీజన్‌లో ఒక్కోటి రూ.30కు పైనే పలుకుతుంది.

డిమాండ్‌ను బట్టి ఒక్కోసారి రూ.40 నుంచి రూ.50 పలుకుతుంది. ఈ చేపలను మన దగ్గర తినడమే కాకుండా.. కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలకు కూడా ఎగుమతి చేస్తారు. మసాలా దట్టించి ఇగురు పెట్టినా.. ఇదే సీజన్‌లో కాసే లేత చింతకాయలతో కలిపి పులుసు పెట్టినా.. ఆ రుచి అమోఘం అంటున్నారు మాంసాహార ప్రియులు. చింతకాయలతో కలిపి వీటిని కూర వండితే ఆ వాసన ఊరి పొలిమేర దాటాల్సిందేనట.

రామచేప రేటే వేరప్పా....

Anantapur | అనంతపురంలో సెల్ రికవరీలో రికార్డు | Eeroju news

Related posts

Leave a Comment