Ram Charan:రామ్ చరణ్ తో సుకుమార్ కూతురు

sukumar-daughter

పుష్ప 2 మూవీలో సుకుమార్ పాన్ ఇండియా డైరెక్టర్ గా తన స్థానం సుస్థిరం చేసుకున్నాడు. వెయ్యి కోట్ల వసూళ్లు అందుకున్న దర్శకుల్లో ఒకరిగా రికార్డులకు ఎక్కాడు. కాగా సుకుమార్ కూతురు కూడా నటి. ఆమె చేసిన మూవీ అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతుందకెరీర్ బిగినింగ్ లో విభిన్నమైన సినిమాలు చేశారు సుకుమార్.

రామ్ చరణ్ తో సుకుమార్ కూతురు ..

హైదరాబాద్, జనవరి 3
పుష్ప 2 మూవీలో సుకుమార్ పాన్ ఇండియా డైరెక్టర్ గా తన స్థానం సుస్థిరం చేసుకున్నాడు. వెయ్యి కోట్ల వసూళ్లు అందుకున్న దర్శకుల్లో ఒకరిగా రికార్డులకు ఎక్కాడు. కాగా సుకుమార్ కూతురు కూడా నటి. ఆమె చేసిన మూవీ అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతుందకెరీర్ బిగినింగ్ లో విభిన్నమైన సినిమాలు చేశారు సుకుమార్. అయితే పక్కా కమర్షియల్ చిత్రాలు ఆయనకు పేరు తెచ్చాయి. రంగస్థలం మూవీతో ఫస్ట్ ఇండస్ట్రీ సుకుమార్ నమోదు చేశాడు. పీరియాడిక్ రివేంజ్ డ్రామాగా తెరకెక్కిన రంగస్థలం బాక్సాఫీస్ దుమ్ముదులిపింది. హీరో రామ్ చరణ్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. పుష్ప చిత్రంలో మరో కమర్షియల్ హిట్ కొట్టాడు సుకుమార్. దానికి కొనసాగింపుగా వచ్చిన పుష్ప 2 సంచలనాల గురించి ఎంత చెప్పినా తక్కువే. అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 రూ. 1700 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.హిందీలో పుష్ప 2 చిత్రానికి వచ్చిన రెస్పాన్స్ ఎవరు ఊహించనిది. హిందీ వెర్షన్ రూ. 800 కోట్ల వసూళ్లకు దగ్గరైంది. అల్లు అర్జున్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో పుష్ప 2 వసూళ్లు రుజువు చేశాయి. దర్శకుడు సుకుమార్ పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగుతుంది. కాగా సుకుమార్ కూతురు కూడా నటి. ఆమె చైల్డ్ ఆర్టిస్ట్ గా గాంధీ తాత చెట్టు టైటిల్ తో ఒక చిత్రం చేసింది. ఈ మూవీ అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శించబడుతూ, ప్రశంసలు, అవార్డులు దక్కించుకుంటుంది.గాంధీ తాత చెట్టు సందేశాత్మకంగా తెరకెక్కిన ఆర్ట్ మూవీ అని సమాచారం. ఈ మూవీలో సుకుమార్ కుమార్తె సుకృతి వేణి ప్రధాన పాత్ర చేసింది. ఉత్తమ నటిగా సుకృతికి అంతర్జాతీయ అవార్డు దక్కింది. ఈ క్రమంలో సుకుమార్ నేషనల్ అయితే.. కూతురు ఇంటర్నేషనల్ అంటూ సోషల్ మీడియాలో అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. సుకుమార్ కి సుకృత తండ్రికి తగ్గ కూతురు అంటున్నారు.గాంధీ తాత చెట్టు చిత్రానికి పద్మావతి మల్లాది దర్శకత్వం వహించారు. సుకుమార్ సతీమణి బబిత సమర్పించారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించాయి. గాంధీ తాత చెట్టు జనవరి 24న థియేటర్స్ లో విడుదల కానుంది. చూస్తుంటే భవిష్యత్ లో సుకుమార్ కుమార్తె సుకృతి స్టార్ హీరోయిన్ గా సత్తా చాటడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక సుకుమార్ నెక్స్ట్ ప్రాజెక్ట్ హీరో రామ్ చరణ్ తో చేస్తున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా జరిగింది. రంగస్థలం అనంతరం రామ్ చరణ్-సుకుమార్ కాంబోలో వస్తున్న ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Read:Hyderabad:పెట్టుబడుల కోసం చంద్రబాబు వర్సెస్ రేవంత్

Related posts

Leave a Comment