Rakshasa movie:రాక్షస తెలుగు వెర్షన్ 26న రిలీజ్

Rakshasa The film will release on February 26 on the occasion of Shivratri

కన్నడ డైనమిక్ ప్రిన్స్ ప్రజ్వల్ దేవరాజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం రాక్షస. ఈ చిత్రాన్ని శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26న ఒరిజినల్ వెర్షన్ కన్నడతో పాటు తెలుగులోనూ రిలీజ్ చేయనున్నారు.

రాక్షస తెలుగు వెర్షన్ హక్కులను దక్కించుకున్న ఎం.వి.ఆర్ కృష్ణ
శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26న సినిమా విడుదల

కన్నడ డైనమిక్ ప్రిన్స్ ప్రజ్వల్ దేవరాజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం రాక్షస. ఈ చిత్రాన్ని శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26న ఒరిజినల్ వెర్షన్ కన్నడతో పాటు తెలుగులోనూ రిలీజ్ చేయనున్నారు. గతంలో శివరాజ్ కుమార్ నటించిన వేద చిత్రాన్ని విడుదల చేసిన ఎంవీఆర్ కృష్ణ రాక్షస ట్రైలర్ నచ్చి తెలుగు రైట్స్ ను దక్కించుకున్నారు. కంచి కామాక్షి కోల్ కతా కాళీ క్రియేషన్స్ బ్యానర్ పై
రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా హీరో ఫస్ట్ లుక్ ను పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో ప్రజ్వల్ దేవరాజ్ డిఫరెంట్ లుక్ లో కనిపిస్తూ ఆకట్టుకున్నారు.
లోహిత్ హెచ్ దర్శకత్వం వహించిన ఈ టైమ్ లూప్ హారర్ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ సినిమాపై ఆసక్తిని పెంచింది.
ఈ సందర్భంగా నిర్మాత ఎంవిఆర్ కృష్ణ మాట్లాడుతూ..”ఈ చిత్రం ప్రేక్షకులకు థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ను అందిస్తుంది. సంక్రాంతి సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే టీజర్ ట్రైలర్ ను కూడా రిలీజ్ చేస్తాం. మంచి కంటెంట్ ఉన్న చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. బాగా ఈ చిత్రానికి కూడా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కుతుందని నమ్మకం ఉంది” అని చెప్పారు.ఈ చిత్రంలో అరుణ్ రాథోడ్, శ్రీధర్, గౌతమ్, సోమశేఖర్, విహాన్ కృష్ణ తదితరులు నటిస్తున్నారు.
ఈ చిత్రానికి సంగీతం : నోబిన్ పాల్, సినిమాటోగ్రఫీ : జైబిన్ పి జాకబ్.
చిత్రం : రాక్షస
నటీనటులు : డైనమిక్ ప్రిన్స్ ప్రజ్వల్ దేవరాజ్, అరుణ్ రాథోడ్, శ్రీధర్, గౌతమ్, సోమశేఖర్, విహాన్ కృష్ణ, జయంత్ తదితరులు..

Read:Pawan Kalyan:’హరి హర వీరమల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ నుంచి మొదటి గీతం ‘మాట వినాలి’ విడుదల

Related posts

Leave a Comment