Rajanna Sirisilla:ఎల్లారెడ్డిపేట్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన ఎస్పీ

SP made a surprise inspection of the Llareddypet police station

శుక్రవారం రోజున ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ ను ఎస్పీ అఖిల్ మహాజన్ ఆకస్మిక తనిఖీ చేసారు. స్టేషన్ పరిసరాలను స్టేషన్ పరిధిలో నమోదు అవుతున్న, నమోదైన కేసుల వివారలు. స్టేషన్ రికార్డ్ లు తనిఖీ చేసారు.

ఎల్లారెడ్డిపేట్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన ఎస్పీ

రాజన్న సిరిసిల్ల
శుక్రవారం రోజున ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ ను ఎస్పీ అఖిల్ మహాజన్ ఆకస్మిక తనిఖీ చేసారు. స్టేషన్ పరిసరాలను స్టేషన్ పరిధిలో నమోదు అవుతున్న, నమోదైన కేసుల వివారలు. స్టేషన్ రికార్డ్ లు తనిఖీ చేసారు. కేసుల దర్యాప్తు విషయంలో అధికారులు అలసత్వం వహించవద్దని, ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా బాధితుల పట్ల తక్షణమే స్పందించాలని, ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో వుంటూ ప్రజల సమస్యలను తీర్చాలని సూచించారు. బ్లూ కోల్ట్ పెట్రో కార్ సిబ్బంది 100 డయల్ కాల్స్ కి తక్షణమే స్పందిస్తూ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. పెట్రోలింగ్ సమయంలో పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్లను ప్రతి రోజు తనిఖీ చేయాలని, స్టేషన్ పరిధిలో సీసీటీవీల ఏర్పాటుపై దృష్టి సారించి సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేయాలని అన్నారు. విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా అధికారులు, విలేజ్ పోలీస్ అధికారులు తరచు గ్రామాలు పర్యటిస్తూ ప్రజలతో మమేకం అవుతు ప్రజలకు చట్టాల మీద,డయల్100, షీ టీమ్స్, సైబర్ నేరాలు, ట్రాఫిక్ నియమాలు తదితర అంశాల మీద అవగాహన కల్పించాలని అన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిబ్బంది అందరి కృషి చేయాలని సిబ్బంది, అధికారులు అందరూ విధులు సక్రమంగా విధులు నిర్వహించడం ద్వారానే శాంతిభద్రతలు అదుపులో ఉంటాయని సూచించారు. పోలీసుల గురించి ప్రజల అభిప్రాయాలను సేకరించడం కోసం తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ప్రారంభించిన క్యూఆర్ కోడ్ ఆఫ్ సిటిజెన్ ని జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్లలో ఏర్పాటు చేయడం జరిగిందని,ఇట్టి క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి పిటిషన్, ఎఫ్ఐఆర్, ఇ-చలాన్ మరియు పాస్పోర్ట్ ధృవీకరణ మరియు పోలీస్ స్టేషన్ కి వెళ్ళినప్పుడు పోలీసు అధికారుల, సిబ్బంది ప్రతిస్పందన మరియు ప్రవర్తనపై ప్రజలు, బాదితులు సద్వినియోగం చేసుకోని పోలీస్ సేవలపై సలహాలు సూచనలు ఇవ్వాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సిఐ శ్రీనివాస్, ఎస్సై రమాకాంత్, సిబ్బంది ఉన్నారు.

Read:Veeranjaneya Swami:శ్రీ వీరాంజనేయ స్వామి ముఖద్వారం ప్రారంభోత్సవం

Related posts

Leave a Comment